Site icon HashtagU Telugu

Srisailam Tourism : తిరుమలతో సమానంగా శ్రీశైలాన్ని అభివృద్ధి చేస్తాం: సీఎం చంద్రబాబు

We will develop Srisailam on par with Tirumala : CM Chandrababu

We will develop Srisailam on par with Tirumala : CM Chandrababu

CM Chandrababu : సీ ప్లేన్ పర్యాటకాన్ని చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. విజయవాడలోని పున్నమిఘాట్ నుంచి శ్రీశైలం న వరకు సీఎం చంద్రబాబు, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, పలువురు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ప్రయాణించారు. తక్కువ సమయంలోనే అత్యున్నత స్థానానికి ఎదిగిన వ్యక్తి రామ్మోహన్ నాయుడు అని కేంద్ర మంత్రి వర్గంలో అత్యంత యువకుడు ఆయన అని కొనియాడారు. సీ ప్లేన్ ప్రయాణం కొత్త అనుభూతిని ఇచ్చిందని, విజయవాడ నుంచి శ్రీశైలానికి 40 నిమిషాల్లో వచ్చామని సీఎం చంద్రబాబు చెప్పారు.

తిరుమల మాదిరిగా శ్రీశైలాన్ని అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాల్సి ఉందన్నారు. తుమ్మల చెరువులో టైగర్ సఫారీకి అవకాశం ఉందన్నారు. శ్రీశైలం వన్యప్రాణుల అభయారణ్యం అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. శ్రీశైలం డ్యామ్ నుంచి నీళ్లు వదిలినప్పుడు చాలా ఆహ్లాదకరంగా ఉంటుందని తెలిపారు. అందుకే ప్రకాశం బ్యారేజీ నుంచి శ్రీశైలానికి సి ప్లేన్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

శ్రీశైలం మాస్టర్ ప్లాన్ రూపకల్పన కోసం మంత్రులు పవన్ కళ్యాణ్, కందుల దుర్గేష్, ఆనం, బీసీ జనార్ధన్ తో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు చంద్రబాబు. సీ ప్లేన్ ప్రయాణం కొత్త అనుభూతిని ఇచ్చిందని, విజయవాడ నుంచి భవిష్యత్ లో ఏ ఇజం ఉండదు.. టూరిజం ఒక్కటే ఉంటుందని పేర్కొన్నారు. దేశంలో తొలిసారి పర్యాటకంగా సీ ప్లేన్ వినియోగం ఏపీ నుంచి ప్రారంభం కానుంది. విజయవాడలోని పున్నమిఘాట్ నుంచి శ్రీశైలం న వరకు సీఎం చంద్రబాబు, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, పలువురు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ప్రయాణించారు.

Read Also: KTR : కౌశిక్ రెడ్డి ఘటన పై స్పందించిన కేటీఆర్‌