తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth ) రైతు భరోసా పథకాన్ని విజయవంతంగా పూర్తి చేశామని ప్రకటించారు. రాష్ట్రంలోని 70 లక్షల రైతు కుటుంబాలకు ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం అందించామన్నారు. కేవలం తొమ్మిది రోజుల్లోనే రైతుల ఖాతాల్లో (Rythu Bharosa) నేరుగా డబ్బులు జమ చేసినట్లు తెలియజేశారు. తెలంగాణ సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన రైతు భరోసా విజయోత్సవ సభలో సీఎం మాట్లాడారు. వ్యవసాయాన్ని “దండగ” అనే స్థితి నుంచి “పండగ” స్థితికి తీసుకురావడమే తమ ముఖ్య లక్ష్యమని, ఉచిత విద్యుత్, రుణ మాఫీలతో రైతులకు సుస్థిర మద్దతు ఇస్తున్నామని తెలిపారు.
Neopolis: రూ. 3169 కోట్లతో నిర్మాణం.. హైదరాబాద్‌లో నియోపోలిస్ భారీ ప్రాజెక్ట్!
రాష్ట్రానికి కొత్త ఉజ్వల దిశను చూపుతున్నట్టు సీఎం రేవంత్ పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ తీసుకున్న పాలసీలు, ఆర్థిక అక్రమాలను ప్రశ్నించారు. రైతులకు ఇచ్చే నిధులను వాయిదాలు వేసిన వారిని విమర్శిస్తూ, తాము మాత్రం రూ. 20,600 కోట్లతో రుణమాఫీ చేసిన ఘనత తమదే అని అన్నారు. కేసీఆర్ కుటుంబం ఫామ్ హౌజ్‌లు ఎలా సంపాదించిందో ప్రజలకు తెలుసునని వ్యాఖ్యానించారు. అప్పట్లో భూములు అమ్మి పథకాలను నడిపించిన వారికి ఇప్పుడే ప్రశ్నించే హక్కు లేదని విమర్శలు గుప్పించారు.
గోదావరి, కృష్ణా జలాలపై తెగే సవాళ్లు విసిరిన సీఎం రేవంత్, అసెంబ్లీలో కేసీఆర్ ముఖాముఖీ చర్చకు సిద్ధమా? అంటూ నిలదీశారు. మాజీ సీఎం చంద్రబాబుతో సమన్వయం, రాయలసీమ ప్రాజెక్టులకు మద్దతు వంటి అంశాలను గుర్తు చేస్తూ కేసీఆర్ పాత్రను ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీని గోదావరి జలాల సెంటిమెంట్‌తో మళ్లీ బతికించాలన్న ప్రయత్నం ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రాభివృద్ధి, రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన అజెండా అని రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు.