Water From Air : శాస్త్రవేత్తలు చివరకు నీటిని కూడా క్రియేట్ చేశారు. ఔను.. గాలి నుంచి నీటిని సక్సెస్ ఫుల్‌గా రాబట్టారు. ఈ అద్భుత ప్రయోగ ఫలితాలను అమెరికాలోని నార్త్‌వెస్ట్రన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సాధించారు. తమ ప్రయోగం వల్ల భవిష్యత్తులో కరువు ప్రాంతాల్లో గాలి నుంచి నీటిని తయారు చేసుకునే వెసులుబాటు అందుబాటులోకి వస్తుందని సైంటిస్టులు ఆశాభావం వ్యక్తం చేశారు. అంతరిక్ష యాత్రికులు పలీడియం ఫలకాలను రోదసిలోకి తీసుకెళ్లి, వాటి ద్వారా అక్కడ నీటిని తయారుచేసుకోవచ్చు. పలీడియం ఫలకాలకు ఆక్సిజన్ జోడించగానే నీరు తయారవుతుంది. పలీడియం ధర ఎక్కువే. అయితే నీటి ఉత్పత్తి ప్రక్రియలో పలీడియం ఫలకాలను వాడిన తర్వాత రీసైక్లింగ్ చేసి మళ్లీమళ్లీ వినియోగంలోకి తేవచ్చు.
Also Read :Women Commandos : మహిళా కమాండోల ధైర్యసాహసాలు.. మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌లో కీలక పాత్ర
ఏమిటీ ప్రయోగం ?
- పలీడియం.. ఇదొక మూలకం. చాలా అరుదుగా లభిస్తుంది. నీటిని ఉత్పత్తి చేసే కెపాసిటీ దీని సొంతం. 1900వ దశకం నుంచే ఈ విషయం సైంటిస్టులకు తెలుసు.
- అందుకే ప్రయోగంలో భాగంగా సైంటిస్టులు పలీడియం (Water From Air) లోహపు పొరను తయారు చేశారు. ఇది తేనెతుట్టె ఆకృతిలో ఉంటుంది. నానోరియాక్టర్లలో వాయు పరమాణువులను ఒడిసిపట్టే సామర్థ్యం ఈ పొర సొంతం.
- హైడ్రోజన్, ఆక్సిజన్ పరమాణువుల కలయికతో నీరు తయారవుతుంది.
- తొలుత పలీడియం లోహపు పొరలోకి హైడ్రోజన్ పరమాణువులను ప్రవేశపెట్టారు.
- హైడ్రోజన్ పరమాణువులు చాలా చిన్నగా ఉంటాయి. అందువల్ల అవి పలీడియం పొర పరమాణువుల మధ్యకు ప్రవేశించి ఇమిడిపోయాయి. దీంతో లోహపు పొర వెడల్పు పెరిగింది.
- అనంతరం దానిలోకి ఆక్సిజన్‌ను వదిలారు. దీనివల్ల హైడ్రోజన్ వెలుపలికి వచ్చి, ఆక్సిజన్‌తో చర్య జరిపింది. ఆ తర్వాత పలీడియం లోహపు పొర ఉపరితలంపై చిన్నపాటి నీటి బుడగలు ఏర్పడే ప్రక్రియ మొదలైంది.
- మనుషులు ప్రత్యక్షంగా వీక్షించిన చిన్నపాటి నీటి బుడగల ఆవిర్భావ ప్రక్రియ ఇదే అని సైంటిస్టులు చెప్పారు.
- సూక్ష్మస్థాయిలో ఈ ప్రక్రియ జరుగుతుండగా శాస్త్రవేత్తలు హై వాక్యూమ్ ట్రాన్స్‌మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపుల సాయంతో వీక్షించారు.
- తద్వారా వీటిలో జరిగే ప్రక్రియలను హై వాక్యూమ్ ట్రాన్స్‌మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపుల సాయంతో వీక్షించే సామర్థ్యాన్ని సాధించారు.