Warangal Road Accident: వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు బస్సు ఢీకొని మాజీ ఎమ్మెల్యే సోదరుడు అక్కడికక్కడే మృతి చెందాడు.వరంగల్ జిల్లా గంగదేవిపల్లి వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకున్నది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జయింది. ప్రమాదం జరిగిన వెంటనే చుట్టు ప్రక్కల స్థానికుల ఘటన వద్దకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అయితే కారులో ఇర్రుక్కుపోయిన వ్యక్తి ప్రమాద స్థలిలోనే మరణించినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదాన్ని స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రమాద ఘటనను పరిశీలిస్తున్నారు.
వరంగల్ జిల్లాలో గంగదేవిపల్లి సమీపంలో జరిగిన ఘోర రద్దు ప్రమాదంలో మృతి చెందింది మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి సోదరుడు కేసముద్రం మాజీ జడ్పీటీసీ వేం పురుషోత్తంరెడ్డిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read More: Boycott NITI Aayog : CMల డుమ్మాపై వేడెక్కిన ఢిల్లీ పాలిటిక్స్