Fake Gold: వరంగల్‌లో ఆంధ్రప్రదేశ్ మహేష్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఇది బయట వ్యక్తులు చేసిన కుంభకోణమని అనుకుంటే పొరపాటే. మోసానికి తెరలేపింది బ్యాంకులో పనిచేస్తున్నే సిబ్బంది. బ్యాంకు మేనేజర్‌తో పాటు జాయింట్ కస్టోడియన్స్, గోల్డ్ అప్రైజర్స్ కలిసి పెద్ద మొత్తంలో నకిలీ రుణాలను సృష్టించి రూ.43 లక్షల మోసానికి పాల్పడ్డారు.
World Environment Day : ప్రకృతి మనందరిది..పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత: సీఎం చంద్రబాబు
ఈ మోసానికి సంబంధించిన ఫిర్యాదు డిప్యూటీ జనరల్ మేనేజర్ చంద్ర ప్రకాష్ వద్దకు చేరింది. ఫిర్యాదులో బ్యాంకు మేనేజర్ కొప్పుల శివకృష్ణ, జాయింట్ కస్టోడియన్స్ రాము శర్మ, జీవిత్ కుమార్, గోల్డ్ అప్రైజర్స్ బ్రహ్మచారి, రాజమౌళి, కరుణాకర్ తదితరులు నకిలీ ఖాతాలు తెరిచి అక్రమ రీతిలో బంగారు ఆభరణాలు తక్కువ విలువ కలిగినవిగా చూపించి పెద్ద మొత్తంలో రుణాలు పొందారని వివరించారు.
ఈ సమాచారం మేరకు బ్యాంకు ఉన్నతాధికారులు బ్యాంకులో విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తప్పుడు ఖాతాలు సృష్టించి నకిలీ బంగారం ఆధారంగా రుణాలు తీసుకున్నట్లు స్పష్టం అయింది. దీనిపై డీజీఎం చంద్ర ప్రకాష్ ఫిర్యాదుతో వరంగల్ ఇంతేజార్ గంజ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శివకృష్ణతో పాటు మిగతా నిందితులపై సెక్షన్ 221 కింద కేసు నమోదు చేశారు. బ్యాంకు లోపాలపై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతోంది.
IPS Transfers : తెలంగాణలో ఏడుగురు సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీ