Site icon HashtagU Telugu

Shri Ram Temple: బాల రామ‌య్య ద‌ర్శ‌నానికి పోటెత్తిన భ‌క్తులు.. వీడియో వైర‌ల్‌..!

Shri Ram Temple

Safeimagekit Resized Img 11zon 11zon

Shri Ram Temple: అయోధ్యలోని రామ మందిరంలో నేటి నుంచి సామాన్య భక్తుల కోసం తెరిచారు. రాత్రి నుంచే రామాలయం వెలుపల భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున ఆలయ తలుపులు తెరుచుకోగానే బాల‌రాముడి (Shri Ram Temple) దర్శనం కోసం భక్తులు ఎంతగానో ఆతృతతో లోపలికి వెళ్లేందుకు పోటీపడ్డారు. ఈ సమయంలో సింగ్ ద్వార్ వద్ద పెద్ద సంఖ్యలో జనం కనిపించారు. మంగళవారం ఉదయం రామాలయం వెలుపలి నుండి భక్తుల రద్దీకి సంబంధించిన తాజా వీడియో బయటపడింది. ఎముకలు కొరికే చలిలోనూ రాంల‌ల్లా దర్శనం కోసం భక్తులు తహతహలాడారు.

దర్శనం ఏ సమయం నుండి ఏ సమయం వరకు జరుగుతుంది?

శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం.. భ‌క్తులు ఉదయం 7 గంటల నుండి బాల రాముడి దర్శనం చేసుకోగలరు. రామాలయం ఉదయం 7 గంటల నుండి 11:30 వరకు తెరిచి ఉంటుంది. ఆ తర్వాత గుడి తలుపులు మూసేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు ఆలయ తలుపులు మళ్లీ తెరవబడతాయి. రాత్రి 7 గంటల వరకు భక్తులు దర్శనం చేసుకోగలరు.

Also Read: Ram Mandir: అయోధ్య రామమందిరంపై విషం కక్కిన పాకిస్థాన్

ఉత్తరప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక కేంద్రం అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జనవరి 22న ఉదయం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దేశ నలుమూలల నుంచి అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు. అనంతరం ఈ మహత్తర ఘట్టం గురించి ప్రధాని మోదీ ప్రసంగించిన విష‌యం తెలిసిందే. బాల రాముడి విగ్ర‌హ ప్రాణ ప్ర‌తిష్ఠ కార‌ణంగా దేశ‌మంతా పండ‌గ వాతావ‌ర‌ణం నెల‌కొంది.

ప్రధాని మోదీ,ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ , యూపీ గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్‌ , యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. సరిగ్గా మధ్యాహ్నం 12.29 గంటలకు అభిజిత్‌ లగ్నంలో బాలరాముడి ప్రాణప్రతిష్ట జరిగింది. 84 సెకన్లపాటు ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని నిర్వహించారు.

We’re now on WhatsApp. Click to Join.