Site icon HashtagU Telugu

Virat Kohli: విరాట్ కోహ్లీ 110 సెంచరీలు కొట్టేస్తాడు : పాక్ క్రికెటర్ షోయబ్ అక్తర్

Virat Kohli

Virat Kohli

విరాట్ కోహ్లీ.. (Virat Kohli) క్రికెట్ ప్రపంచంలో రారాజు. వన్డే అయినా, టెస్ట్ అయినా, టీ20 అయినా పరుగుల వరద పారాల్సిందే.. రికార్డులు దాసోహం కావాల్సిందే. ఇప్పటికే వన్డే, టెస్ట్ ఎన్నో రికార్డలు సాధించిన విరాట్ పై భారత మాజీలతో పాటు ఇతర దేశాల క్రికెటర్స్ ఓ రేంజ్ లో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే 75 సెంచరీలు కొట్టిన విరాట్ కోహ్లీ సచిన్ టెండూల్కర్ రికార్డులను సైతం అధిగమిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన కెరీర్ లో 110 సెంచరీలు సాధిస్తాడని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ (Shoaib Akhtar) అక్తర్ జోస్యం చెప్పాడు. కోహ్లీ అన్ని ఫార్మాట్ లలో ఫామ్ లోకి వచ్చాడు. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ లో సెంచరీ చేసి సుదీర్ఘ సెంచరీ ఉత్కంఠకు తెర దించాడు.

మూడేళ్లుగా టెస్టుల్లో సెంచరీ (Virat Kohli) చేయలేదు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ ద్వారా 186 పరుగులు చేశాడు. ఇప్పుడు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కు సిద్ధమవుతున్నాడు. వన్డేల్లోను చాలా రోజులుగా సెంచరీ లేదు. ఇప్పుడు ఫామ్ లోకి రావడంతో తదుపరి మ్యాచ్ లోను అభిమానులు సెంచరీని ఆశిస్తున్నారు. ఇలాంటి సమయంలో అక్తర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

కోహ్లీ (Virat Kohli) ఫామ్ లోకి వచ్చాడని, అయితే ఇదేమీ కొత్త విషయం కాదన్నారు. గతంలో కెప్టెన్సీ కారణంగా తీవ్ర ఒత్తిడిలో ఉండేవాడని, ఇప్పుడు ఆ ఒత్తిడి మాత్రం లేదని గుర్తు చేశారు. మానసికంగా ఇప్పుడు స్వేచ్చగా ఉన్నట్లు చెప్పాడు. తప్పకుండా మరింత ఫోకస్ పెట్టి మ్యాచ్ లు ఆడుతాడని అభిప్రాయపడ్డారు. అత్యధిక సెంచరీల రికార్డ్ ప్రస్తుతం సచిన్ టెండుల్కర్ ఖాతాలో ఉన్నాయని, కోహ్లీ ఆయనను అధిగమించడంతో పాటు 110 సెంచరీలు కూడా సాధిస్తాడని జోస్యం చెప్పారు.

Also Read: Mukesh Ambani’s Chef: ముకేశ్ అంబానీ ‘వంట మనిషి’ జీతం ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Exit mobile version