Chandarayaan-3: ప్రపంచ దేశాలు భారత్ వైపు.. ఆగస్టు 23 కోసం వెయిటింగ్

భారత్ చంద్రయాన్-3 సరికొత్త చరిత్ర సృష్టించే దిశగా అడుగులు వేస్తోంది. జూలై 14న లాంచ్ అయిన తర్వాత, అనుకున్న స్థాయిలో అన్ని దశలను దాటుకుంటూ

Chandarayaan-3: భారత్ చంద్రయాన్-3 సరికొత్త చరిత్ర సృష్టించే దిశగా అడుగులు వేస్తోంది. జూలై 14న లాంచ్ అయిన తర్వాత, అనుకున్న స్థాయిలో అన్ని దశలను దాటుకుంటూ శనివారం ఆదివారం తెల్లవారుజామున 2 గంటలకు తుది డీబూస్టింగ్ పూర్తి చేసింది. ఇప్పుడు ల్యాండర్ మరియు రోవర్లతో కూడిన ల్యాండర్ మాడ్యూల్ చంద్రునికి అత్యంత సమీప కక్ష్యకు చేరుకుంది. చంద్రుడి నుండి దాని దూరం ఇప్పుడు కేవలం 25 కి.మీ.

భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్ చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 23న 140 కోట్ల మంది భారతీయుల కల నెరవేరబోతోంది. ఈ విజయంతో చంద్రుని దక్షిణ ధృవాన్ని చేరుకున్న ప్రపంచంలోనే తొలి దేశంగా భారత్‌ అవతరిస్తుంది. ఇప్పటివరకు అమెరికా, అప్పటి సోవియట్ యూనియన్ (రష్యా) మరియు చైనా మాత్రమే తమ ల్యాండర్‌లను చంద్రుని ఉపరితలంపై దించాయి. కానీ చంద్రుని దక్షిణ ధృవానికి ఎవరూ చేరుకోలేకపోయారు. అంతరిక్ష పరిశోధనలో భారత్‌ సాధించిన ప్రగతికి ప్రతీకగా సైన్స్‌, ఇంజినీరింగ్‌, టెక్నాలజీ, పరిశ్రమలకు ఈ విజయం మైలురాయిగా నిలుస్తుందని ఇస్రో పేర్కొంది.

Also Read: Shishir Sharma : జల్సాలో మెయిన్ విలన్‌గా చేయాల్సింది.. పవన్ కళ్యాణ్ తండ్రిగా చేశాడు.. ఏమైంది..?