Site icon HashtagU Telugu

Video: ఐఫోన్-15 కోసం గొడవ.. వీడియో వైరల్

Video

Video

Video: ఢిల్లీలో ఓ మొబైల్ దుకాణంలో జరిగిన గొడవకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఐఫోన్ సిరీస్15 డెలివరీ జాప్యం కారణంగానే ఈ గొడవ జరిగిందని పోలీసులు తెలిపారు. చివరికి మొబైల్ వినియోగదారులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఢిల్లీలోని రూప్‌నగర్‌లో ఉన్న క్రోమా షోరూమ్‌లో శుక్రవారం మధ్యాహ్నం గొడవ జరిగింది. జస్కీరత్ సింగ్ మరియు మన్‌దీప్ సింగ్ ఐఫోన్15 బుక్ చేశారు.సెప్టెంబర్ 22న డెలివరీ కావాల్సి ఉంది. కానీ దుకాణదారుడు సెప్టెంబర్ 22న మొబైల్ డెలివరీ చేయలేకపోయాడు. దీంతో కస్టమర్స్ క్రోమా షోరూంకి వచ్చి ప్రశ్నించారు. సిబ్బందితో కాస్త దురుసుగా ప్రవర్తించారు. దాంతో సిబ్బందికి, కస్టమర్స్ కి మధ్య జరిగిన గొడవను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో వీడియో క్షణాల్లో వైరల్ గా మారింది. కాగా భారతదేశంలో ఐఫోన్15 ప్రారంభ ధర రూ.79,900.

Also Read: India vs Canada: భారత్ వర్సెస్ కెనడా.. పూర్తిగా దెబ్బతిన్న సంబంధాలు