Wife Kills Husband : “ప్రేమ ఉంటేనే పెళ్లి చేసుకోండి… కానీ భర్తలను చంపకండి” – వీహెచ్

Wife Kills Husband : ఇటీవల పెళ్లైన కొందరు మహిళలు భర్తలను హత్య చేయడం వంటి సంఘటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు

Published By: HashtagU Telugu Desk
Vh

Vh

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు (VH) లవ్ ఎఫైర్స్ తో పాటు ఇటీవల జరుగుతున్న భర్తల హత్యల(Wife Kills Husband)ఫై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పెళ్లైన కొందరు మహిళలు భర్తలను హత్య చేయడం వంటి సంఘటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. “ప్రేమ ఉంటేనే పెళ్లి చేసుకోండి… కానీ భర్తలను చంపకండి” అంటూ సూచించారు. కుటుంబ వ్యవస్థను కాపాడేందుకు భర్తా భార్యలు పరస్పరం విశ్వాసంతో జీవించాలని ఆయన హితవు పలికారు.

Tirumala Laddu Controversy : తిరుమల లడ్డూ కల్తీ అంశం.. సుప్రీంకోర్టుకు సిట్‌ నివేదిక

భార్యభర్తల మధ్య పరస్పర ప్రేమ, నమ్మకమే కుటుంబ బంధాల ఆధారం. ‘‘సత్య హరిశ్చంద్రుడి ప్రాణాల కోసం భార్య యమునితో పోరాడింది. కానీ ఇప్పుడు భార్యలే భర్తలను చంపే స్థితికి వస్తున్నారు. ఇదెక్కడి మార్పు?’’ అంటూ ఆయన ప్రశ్నించారు. తల్లులే భర్తలపై దాడులకు దిగితే, పిల్లల భవిష్యత్తు ఏమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కుటుంబ వ్యవస్థ కాపాడాలంటే ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలు నిబద్ధతతో నిర్వహించాలని అన్నారు.

ఇప్పటి సమాజంలో కుటుంబ వ్యవస్థలో చోటుచేసుకుంటున్న చీలికలు, నమ్మకం లోపం వల్లే ఇటువంటి దురాంతాలు జరుగుతున్నాయని వీహెచ్ అభిప్రాయపడ్డారు. భార్యాభర్తలు కలిసే జీవించాలన్న సూత్రంతో ముందుకు వెళ్లాలన్నారు. పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలంటే, తల్లిదండ్రుల మధ్య ప్రేమ, సమర్థవంతమైన సంబంధం ఉండాలన్నారు. కుటుంబ విలువల్ని కాపాడుకునేందుకు సమాజం అంతటా చైతన్యం రావాలన్నది ఆయన విజ్ఞప్తి.

  Last Updated: 27 Jun 2025, 07:31 PM IST