వనం-మనం (Vana Mahotsavam) పేరిట ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో భాగంగా నేడు పల్నాడు (D)లో సీఎం చంద్రబాబు (Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పర్యటించనున్నారు. కాకాని పంచాయతీ పరిధిలోని JNTUలో మొక్కలు నాటనున్నారు. రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించేందుకు ప్రభుత్వం ‘మనం వనం’ కార్యాక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ సీజన్లో జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో 10 లక్షలు మొక్కలు నాటేలా లక్ష్యం పెట్టుకున్నారు. అందులో భాగంగా జేఎన్టీయూ వద్ద ఆరు వేలు, పల్నాడు జిల్లా వ్యాప్తంగా నేడు 3.5 లక్షల మొక్కలు నాటేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. అందులో రావి, వేప, నాగమల్లి మొక్కలను నాటనున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇదిలా ఉంటె రేపు సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. పత్తికొండ (మ) పుచ్చకాయలమడలో జరిగే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొనున్నారు. గన్నవరం ఎయిర్పోర్టు నుంచి ఓర్వకల్ ఎయిర్పోర్టుకు ప్రత్యేక విమానంలో వెళ్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో పుచ్చకాయలమడకు చేరుకోనున్నారు.
Read Also : SR Gudlavalleru Engineering College : అమ్మాయిల బాత్రూంలో సీక్రెట్ కెమెరాలు- విద్యార్థుల ఆందోళన