Site icon HashtagU Telugu

Viral : మద్యానికి డబ్బులు ఇవ్వలేదని భార్యను మూడవ అంతస్తు నుంచి వేలాడదీశన భర్త

Drunk

Drunk

Viral : దేశంలో మహిళలపై జరుగుతున్న దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సాటి మనుషుల నుంచి రక్షణ పొందాల్సిన భార్యలు, కుటుంబమే ప్రమాదంగా మారిన దుస్థితిని ఎదుర్కొంటున్నారు. ఒకవైపు లైంగిక వేధింపులు మహిళల భద్రతపై ప్రశ్నలు వేస్తుంటే, మరోవైపు కుటుంబాల్లో భర్తల చేతలే భార్యల పట్ల హింసకు నిదర్శనమవుతున్నాయి. ఇదంతా చదవడానికే భయంకరంగా ఉందంటే… తాజాగా ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకున్న ఘటన మాత్రం మానవత్వాన్ని మరిచిపోయేలా ఉంది.

Kishan Reddy : తెలంగాణ ఆర్థిక పరిస్థితి దివాళా తీసింది..

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఓ నివాసంలో ఇటీవల జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలకు దారితీస్తోంది. స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి, తన భార్యకు మద్యానికి డబ్బులు ఇవ్వలేదన్న కారణంతో ఆమెపై విరుచుకుపడ్డాడు. నిత్యం గొడవలు పెట్టుకునే అతడు, ఆ రోజు ఉద్రిక్తత పెరిగి ఆమెను మూడవ అంతస్తులోని బాల్కనీ నుంచి కింద వేలాడదీశాడు. దాదాపు 20 నిమిషాల పాటు ఆమెను అలా వేలాడదీసి శారీరకంగా, మానసికంగా బాధించాడు. ఆమె ప్రాణాలు గాల్లో వేలాడుతూ సహాయం కోసం అరవడంతో పరిసర నివాసితులు అక్కడికి చేరుకుని వెంటనే ఆమెను రక్షించారు. ఆ భర్తపై కోపంతో స్థానికులు అతనిపై దాడి కూడా చేశారు.

ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందగా, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం. ఇదిలా ఉండగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. “ఇలాంటి క్రూరుల్ని శిక్షించకపోతే మహిళలకు ఎప్పటికీ రక్షణ ఉండదు” అని నెటిజన్లు మండిపడుతున్నారు.

ఇటువంటి సంఘటనలు మహిళల భద్రతపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. మహిళలపై హింసను అరికట్టేందుకు కఠిన చట్టాలు ఉన్నప్పటికీ, వాటి అమలులో నిర్లక్ష్యం, బాధితురాళ్లకు సకాలంలో న్యాయం అందకపోవడమే ఇలాంటి దుర్మార్గాలకు దారితీస్తున్నట్లు అనేక మంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Annadatta Sukhibhava : ఏపీ రైతులకు గుడ్‌న్యూస్‌.. ‘అన్నదాతా సుఖీభవ’ డబ్బుల జమ ఎప్పుడంటే..?