నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar)..ప్రజా ప్రతినిధులు నేడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. పెండింగ్ లో ఉన్న నీటి పారుదల ప్రాజెక్టులను పరిశీలించి అత్యంత వేగంగా ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టనున్నారు. చివరి దశలో ఉన్న ప్రాజెక్టులకు ఉన్న సాంకేతిక, ఆర్థిక, శాఖ పరమైన అడ్డంకులను తొలగించి వెంటనే ప్రాజెక్టులను ఉపయోగించే విదంగా చర్యలు చేపట్టనున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంట జిల్లా మంత్రి ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, ఆర్థిక, నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు ఉండనున్నారు.
జడ్చర్ల పరిధిలోని ఉదండాపూర్ రిజర్వాయర్ (Udandapur Reservoir )పనుల పురోగతిని రాష్ట్ర ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy), జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ..పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ ప్రభుత్వానికి ఎంతో ప్రాధాన్యమైందని చెప్పారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. ఉదండాపూర్ ప్రాజెక్ట్ నిర్వాసితులకు రూ.45 కోట్లు విడుదల చేశామన్నారు. మిగతా నిధులు కూడా త్వరలో విడుదల చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. వారి వెంట నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్యేలు అనిరుధ్ రెడ్డి, జి.మధుసూదన్ రెడ్డి, ఈర్లపల్లి శంకర్, వాకిటి శ్రీహరి యెన్నం శ్రీనివాస్ రెడ్డి, తదితరులు ఉన్నారు.
Read Also : Vodafone Idea: వొడాఫోన్ ఐడియాపై ఫిర్యాదు.. జరిమానా విధించిన కమిషన్!