Wife Shoot Husband: విడాకులు అడిగినందుకు భర్తపై భార్య కాల్పులు

అమెరికాలోని అరిజోనాలో విడాకులు అడిగినందుకు ఓ మహిళ తన భర్తపై కాల్పులు జరిపింది. పోలీసులు మహిళను అదుపులోకి తీసుకున్నారు. నిజానికి భార్యాభర్తలిద్దరూ చాలా నెలలుగా విడివిడిగా నివసిస్తున్నారు,

Published By: HashtagU Telugu Desk
Wife Shoot Husband

Wife Shoot Husband

Wife Shoot Husband: అమెరికాలోని అరిజోనాలో విడాకులు అడిగినందుకు ఓ మహిళ తన భర్తపై కాల్పులు జరిపింది. పోలీసులు మహిళను అదుపులోకి తీసుకున్నారు. నిజానికి భార్యాభర్తలిద్దరూ చాలా నెలలుగా విడివిడిగా నివసిస్తున్నారు, దీనిపై భర్త మహిళ నుండి విడాకులు కోరాడు, ఈ కారణంగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో మహిళ తన భర్తను కాల్చి చంపింది. బుల్లెట్‌తో భర్త గాయపడ్డాడు కానీ అదృష్టవశాత్తూ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. 62 ఏళ్ల మహిళ క్రిస్టినా పాస్క్వాలెట్టో తన భర్త జాన్ పాస్క్వాలెట్టో తుపాకీతో కాల్చిన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. బులెట్ గాయాలతో జాన్ పొరుగింటి సహాయంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. మహిళ తన ఇంటి నుండి 8 లక్షల విలువైన చెక్కులు, వస్తువులను మోసపూరితంగా దొంగిలించిందని భర్త ఆరోపించాడు. పోలీసుల విచారణలో దొంగతనం, మోసం చేసినట్లు సదరు మహిళ అంగీకరించింది. ప్రస్తుతం కేసుని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Also Read: Chandrababu Lunch Break : లంచ్ బ్రేక్ దాకా చంద్రబాబుకు సీఐడీ వేసిన ప్రశ్నలు అవేనా !?

  Last Updated: 24 Sep 2023, 02:27 PM IST