UP School Time: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పాఠశాలల ప్రారంభ సమయానికి సంబంధించి మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు . సెకండరీ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ మహేంద్ర దేవ్ ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల ప్రారంభ సమయాన్ని ఉదయం 10 గంటలకు మార్చినట్లు డైరెక్టర్ తెలిపారు.
విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో విపరీతమైన చలి, చలిగాలుల కారణంగా పాఠశాలల వేళల్లో మార్పు చేశారు. ఇప్పటి వరకు పాఠశాలలు ఉదయం 8.50 గంటలకు తెరవగా, దానిని 10 గంటలకు మార్చారు. దీంతో పాటు పాఠశాలల మూసివేత సమయాన్ని మధ్యాహ్నం 2:50కి బదులుగా మధ్యాహ్నం 3 గంటలకు మార్చారు. దీంతో ఇకపై తరగతులు 5 గంటలు మాత్రమే జరగనున్నాయి.
Also Read: Telangana: కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభవార్త… హైకోర్టు కీలక ఆదేశాలు