ఇటీవల ప్రమాణస్వీకారం చేసిన మంత్రులకు సీఎం చంద్రబాబు (Chandrababu) శాఖలు కేటాయించారు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు కీలక బాధ్యతలు అప్పగించారు. డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను కేటాయించారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తూ వస్తున్నారు.
తాజాగా యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ (UP CM Yogi Aditya) పవన్ కల్యాణ్‌కు డిప్యూటీ సీఎం పదవి రావడం పట్ల ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న పవన్ కల్యాణ్ కు హృదయ పూర్వక అభినందనలు తెలిపారు. విషింగ్ యూ ఏ సక్సెస్‌ఫుల్ అండ్ ఇంపాక్ట్ ఫుల్ టెన్యూర్ అహెడ్ అని యోగీ ఆదిత్యనాథ్ ట్వీట్ చేశారు. ఇక, తమ అభిమాన నేతకు యూపీ సీఎం యోగి విషెస్ తెలపడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక తిరుపతిలో జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ కు కీలక శాఖలు కేటాయించిన నేపథ్యంలో సంబురాలు చేసుకున్నారు. తిరుపతి జనసేన ఇంఛార్జి కిరణ్ రాయల్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ సందర్భంగా కిరణ్ రాయల్ మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ అంటేనే బ్రాండ్ అని … ఏపీకి ఏకైక డిప్యూటీ సిఎంగా అయ్యారని తెలిపారు. ఎమ్మెల్యే కానివ్వమని ఊకదంపుడు ఉపన్యాసాలు చేసిన వారు ఇప్పుడు తలెక్కడ పెట్టుకుంటారోనని కిరణ్ రాయల్ ఎద్దేవా చేశారు.
Heartfelt congratulations to Shri @PawanKalyan Ji on becoming the Deputy Chief Minister of Andhra Pradesh!
Wishing you a successful and impactful tenure ahead.
— Yogi Adityanath (@myogiadityanath) June 14, 2024
Read Also : Telugu Text Books : తెలంగాణ పాఠ్యపుస్తకాల వివాదం..ఇద్దరిపై వేటు