Site icon HashtagU Telugu

Unified Pension Scheme: ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్, 25 సంవత్సరాల సర్వీస్‌పై 50% పెన్షన్

Unified Pension Scheme

Unified Pension Scheme

Unified Pension Scheme: ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఏకీకృత పెన్షన్ పథకానికి కేంద్ర ప్రభుత్వం శనివారం ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకం కింద ఒక ఉద్యోగి 25 సంవత్సరాలు పనిచేసినట్లయితే, అతను పదవీ విరమణకు ముందు ఉద్యోగంలో గత 12 నెలల సగటు జీతంలో 50 శాతం పెన్షన్‌గా పొందుతాడు. దాదాపు 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దాదాపు 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు లబ్ధి పొందుతారని సమాచార, ప్రసార, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఇప్పుడు ఉద్యోగులు జాతీయ పెన్షన్ స్కీమ్ (ఎన్‌పిఎస్) మరియు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యుపిఎస్)లలో దేనినైనా ఎంచుకునే అవకాశం ఉందని ఆయన అన్నారు.

Also Read: Telangana: రైతులను పట్టించుకోని రేవంత్, సీపీఎం భారీ ధర్నాకు పిలుపు