Site icon HashtagU Telugu

Union Budget 2025 : వార్షిక బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం

Budget 2025

Budget 2025

Union Budget 2025 : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ 2025-2026 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను 8వసారి ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో, కేంద్ర కేబినెట్ సమావేశం నిర్వహించి 2025 బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ అంచనాలు ఈసారి పెంచబడ్డాయి. వేతనజీవులకు ట్యాక్స్‌ రేట్లు తగ్గించే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా, వార్షిక ఆదాయం రూ.10 లక్షల వరకు ఉన్న వ్యక్తులకు ఆదాయపు పన్ను మినహాయింపు ఇవ్వాలని భావించబడుతోంది. దీనిపై ఇప్పటికే అనేక వార్తలు కూడా వచ్చాయి.

కొత్త పన్ను విధానంలో, స్టాండర్డ్‌ డిడక్షన్‌ను రూ.75,000 నుంచి పెంచే అవకాశంపై చర్చలు జరుగుతున్నాయి. పేదలు, మధ్యతరగతికి మరింత అనుకూలత ఇచ్చేలా బడ్జెట్‌లో మార్పులు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు ఇచ్చిన తర్వాత, ఆశలు పెరిగాయి. అలా కూడా, గత నాలుగేళ్లలో కనిష్ఠమైన వృద్ధిరేటు నమోదవ్వడంతో, ఆర్థిక వ్యవస్థను పుంజించేందుకు స్పీడ్ పెంచేందుకు ప్రభుత్వం ప్రణాళికలు వేసే అవకాషం ఉందని భావిస్తున్నారు.

Union Budget 2025: తెలుగు రాష్ట్రాల ఆశలు కేంద్రం బడ్జెట్‌పైనే..!

కాసేపట్లో, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. అయితే, బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి ముందు, ప్రోటోకాల్ ప్రకారం, ఆమె రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. ఈ సందర్భంగా, 2025 బడ్జెట్ కాపీని రాష్ట్రపతికి అందించారు. అలాగే, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమెను ఆహ్వానించి స్వీట్‌ తినిపించారు. అనంతరం, కేంద్ర కేబినెట్ సమావేశంలో బడ్జెట్‌ పై ఆమోదం పొందింది.

ఇక మరో ప్రధాన అంశం, ప్రపంచవ్యాప్తంగా బిట్‌కాయిన్ ధరలు భారీగా పెరిగిపోతున్నా, మనదేశంలో ఈ క్రిప్టో కరెన్సీకి సంబంధించిన ఆసక్తి అంగీకారం పొందడం లేదు. అమెరికా, ఇతర పలు దేశాలు వేల కోట్ల డాలర్లను ఈ క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులు పెడుతుంటే, మన భారత ప్రభుత్వం మాత్రం దీనిపై పెద్దగా స్పందించ లేదు. ప్రపంచ దేశాల దృష్టి ప్రస్తుతం డిజిటల్ కరెన్సీపై ఉంది. కనుక, ఇప్పుడు మార్చిన పరిస్థితుల దృష్ట్యా, మోదీ సర్కార్ కూడా క్రిప్టో కరెన్సీని పై దృష్టి పెంచి, ఇది సంబంధించి చర్యలు తీసుకుంటుందా, అనేది అర్ధం కావాల్సి ఉంది.

ప్రస్తుతం ప్రపంచంలో క్రిప్టో కరెన్సీ మీద ఆసక్తి పెరిగిన నేపథ్యంలో, భారత్ కూడా దీనిపై తన దృష్టిని మరలిస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిన విషయం.

Tax Payers: బడ్జెట్‌లో పన్ను చెల్లింపుదారులకు శుభవార్త.. ఆ గడువు పెంచే అవకాశం..!