Viral News : ఓరుగల్లులో ఓ కార్యకర్త తన అభిమాన నాయకుడి జన్మదినాన్ని వినూత్నంగా జరుపుకోవడం ఇప్పుడు నగరంలో ఆసక్తికర చర్చగా మారింది. ఈ ఘటన వరంగల్ నగరంలో జరిగి అందరిలోనూ హాట్ టాపిక్‌గా నిలిచింది. తన అభిమాన నేత జన్మదినాన్ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయాలనే ఉద్దేశంతో అతను మందుబాబులకు ఉచితంగా మద్యం బాటిళ్లు పంపిణీ చేసి సంచలనం సృష్టించాడు. ఈ వేడుకల సారథి మంత్రి కొండా సురేఖ అనుచరుడు గోపాల నవీన్ రాజ్. బుధవారం నాడు ఆయన జన్మదిన వేడుకలు వరంగల్ నగరంలో న్యూ ఇయర్ రోజునే జరగడంతో వేడుకల ఉత్సాహం రెట్టింపు అయింది. జన్మదినానికి విశేష జనసమీకరణతో గ్రాండ్‌గా పార్టీ నిర్వహించారు. అయితే, అందరిలా కాకుండా ఒక అడుగు ముందుకేసి, ప్రత్యేకంగా మద్యం బాటిళ్లను ఉచితంగా పంపిణీ చేసి ప్రజల దృష్టిని ఆకర్షించారు.
Pawars Reunion : ఏకం కానున్న ఇద్దరు పవార్లు ? అజిత్ పవార్ తల్లి కీలక వ్యాఖ్యలు
ఈ కార్యక్రమంలో భాగంగా నవీన్ రాజ్ అనుచరులు “తెలంగాణ దావత్” పేరుతో మద్యం షాప్ వద్దకు మందుబాబులను పిలిచారు. అక్కడ వారికి క్వార్టర్ బాటిల్స్, ఆఫ్ బాటిల్స్ ఉచితంగా అందించి, తమ అభిమానాన్ని చూపించారు. ఇది మద్యం ప్రియులకు పండగ లాంటి రోజుగా మారింది. అయితే, ఈ చర్య పలు విమర్శలకు దారితీసింది. “వెర్రి వెయ్యి విధాలు” అన్నట్లు, ఈ చర్యపై ప్రజల్లో చర్చ జోరుగా సాగుతోంది. ఈ జన్మదిన వేడుకలలో మరో వివాదాస్పద అంశం భద్రకాళి అమ్మవారి ఆలయంలో చోటుచేసుకుంది. నవీన్ రాజ్‌కు ఎలాంటి అధికారిక పార్టీ పదవి లేకపోయినా, ఆలయంలో ప్రోటోకాల్ దర్శనం కల్పించడంపై గతంలో జనాల్లో అనేక ప్రశ్నలు తలెత్తాయి. ఆలయ ప్రధాన ద్వారం ముందు భారీ క్రేన్ సహాయంతో భారీ గజమాల వేయించడం, ఈ చర్య కారణంగా ట్రాఫిక్ స్తంభించడం ప్రజల ఆగ్రహానికి కారణమయ్యాయి.
మద్యం పంపిణీ , గజమాల వివాదం ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. రాజకీయవేత్తలు, సామాన్యులు ఈ అంశంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి చర్యలు సామాజిక బాధ్యతా రహితంగా ఉన్నాయని పలువురు విమర్శిస్తున్నారు. ఇది జనంలో మాత్రమే కాదు, రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశమవ్వడం గమనార్హం.