Site icon HashtagU Telugu

Spider Web: స్పైడర్ వెబ్‌పై రష్యా వ్యూహాత్మక మౌనం.. కౌంటర్ ఎటాక్‌కు ప్రణాళికలు..

Spider Web

Spider Web

Spider Web: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం నాలుగేళ్లుగా కొనసాగుతూనే ఉంది. ఇరు పక్షాల మధ్య జరిగిన ఘోర దాడులు, పరస్పర వాయిదాల కారణంగా ఉక్రెయిన్‌లో అనేక ప్రాంతాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఉక్రెయిన్ కూడా రష్యా పై డ్రోన్లు, క్షిపణులు విసురుతూ తీవ్ర నష్టాలు కలిగిస్తోంది. ఈ మధ్య కాలంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి పదవికి చేరుకున్న తరువాత ఈ యుద్ధాన్ని ఆపేందుకు శతవిధాలా ప్రయత్నించారు. సౌదీ అరేబియాలో రష్యా , అమెరికా మధ్య చర్చలు కూడా జరిగాయి. ట్రంప్ స్వయంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్లో మాట్లాడినా, ఇరువురి మధ్య యుద్ధం ఆపటం సాధ్యమయ్యలేదు.

తాజాగా ఇస్తాంబుల్ వేదికగా మరోసారి శాంతి చర్చలు జరగనున్న సందర్భంలో, ఉక్రెయిన్ ఊహించని రీతిలో రష్యా వైమానిక స్థావరాలపై భారీ డ్రోన్ దాడి నిర్వహించింది. ఈ ఆపరేషన్‌కు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోల్డిమిర్ జెలెన్‌స్కీ “స్పైడర్ వెబ్” అని పేరు పెట్టారు. దాడి ఘన విజయం సాధించిందని ప్రకటించారు. ఇప్పటి వరకు రష్యా ప్రభుత్వానికేనా, పుతిన్ వ్యక్తిగతంగా ఎలాంటి అధికారిక ప్రకటనలు లేకపోవడంతో, నిపుణులు ఈ మౌనానికి వెనుక వ్యూహాత్మక కారణాలు ఉండవచ్చని భావిస్తున్నారు. రష్యా వ్యూహాత్మక మౌనం పాటిస్తూ, సరికొత్త కౌంటర్ ఆపరేషన్లను ప్రణాళిక చేయబోతుందని వార్తలు వస్తున్నాయి.

World Cup 2025: ICC మహిళల వరల్డ్ కప్ 2025 వేదికలు, తేదీలు వెల్లడి.. పూర్తి షెడ్యూల్ ఇదే!

సోమవారం ఇస్తాంబుల్‌లో జరగబోయే శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ దాడి చేసింది. డ్రోన్ల ద్వారా రష్యా వైమానిక స్థావరాలను లక్ష్యం చేసుకున్న ఈ దాడిలో దాదాపు 40కి పైగా రష్యన్ యుద్ధ విమానాలు తీవ్రంగా నష్టం పొందాయని, దాని విలువ సుమారు 7 బిలియన్ డాలర్లు అని ఉక్రెయిన్ భద్రతా సంస్థ ఎస్‌బీయూ పేర్కొంది. 117 డ్రోన్లను సెమీ ట్రైలర్ ట్రక్కుల ద్వారా రహస్యంగా రష్యా భూభాగంలోకి తరలించినట్టు సమాచారం. ఈ డ్రోన్లు రిమోట్ కంట్రోల్ సాంకేతికతతో పేలుజన్య పదార్థాలను పేల్చి, రష్యా వ్యూహాత్మక బాంబర్లను ధ్వంసం చేశారు. ఆపరేషన్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పర్యవేక్షణలో జరిగింది.

జెలెన్‌స్కీ వివరాల ప్రకారం, ఈ దాడి రష్యా భద్రతా సంస్థ ఎఫ్ఎస్‌బీ కార్యాలయం పక్కనే ఉన్న ప్రాంతంలో జరిగింది. ఖచ్చితమైన స్థలాన్ని వెల్లడించకుండా, రహస్యంగా ట్రక్కుల తరలింపు, ఎయిర్‌ఫీల్డ్‌కు దగ్గరగా డ్రోన్‌ల దాడి జరిగిందని తెలిపారు.ఈ ఘటన ఉక్రెయిన్-రష్యా సంబంధాల్లో కొత్త ఉద్రిక్తతలకు దారితీస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇస్తాంబుల్‌లో జరగబోయే చర్చలు ఈ నేపథ్యంలో ఎంతవరకు ఫలవంతమవుతాయో చూడాల్సి ఉంది.

CBI : IRS ఇంట్లో రూ.కోటి నగదు, 3.5 కేజీల గోల్డ్