Hyderabad: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. దాదాపు 1.12 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్ అధికారులు. జెడ్డా నుంచి వస్తున్న ఇద్దరు ప్రయాణికులు 1.12 కోట్ల విలువైన బంగారాన్ని తీసుకొస్తుండగా కస్టమ్ పోలీసులు అడ్డుకున్నారు. ఇనుప పెట్టెలో బంగారం తరలిస్తుండగా అనుమానం వచ్చిన అధికారులు తనిఖీ చేయగా భారీగా బంగారం వెలుగు చూసింది. దీంతో ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేసి పలు కోణాల్లో విచారిస్తున్నారు. సెక్షన్ 132, 135 ప్రకారం కేసులు నమోదు చేశారు. కస్టమ్స్ చట్టంలోని సెక్షన్ 104 కింద ప్రయాణికులను అరెస్టు చేశారు. అలాగే ప్రయాణికుల నుంచి స్వాధీనం చేసుకున్న బంగారాన్ని కస్టమ్స్ చట్టంలోని సెక్షన్ 110 కింద స్వాధీనం చేసుకున్నారు.
Also Read: IND vs WI Pitch Report: రెండో టీ20 మ్యాచ్: పిచ్ రిపోర్ట్