శ్రీవారి భక్తులకు టీటీడీ(తిరుమల తిరుపతి దేవస్థానం) ఒకేసారి రెండు శుభవార్తలు చెప్పింది. మొదట కరోనా కారణంగా నిలిపివేసిన సర్వదర్శన టోకెన్ల జారీని పునరుద్ధరించనున్నట్లు టీటీడీ ఈవో జవహార్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 16వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో కూడా సర్వదర్శన టోకెన్ల జారీ ప్రక్రియ కొనసాగుతాయన్నారు. ఇక మరో శుభవార్త ఏంటంటే.. తిరుమలలో శ్రీవారి ఉదయస్తమాన సేవా టికెట్లను కూడా అందుబాటులోకి తెస్తామని టీటీడీ ఈవో జవహార్ తెలిపారు. ఈ సందర్భంగా ఈ నెల 16వ తేదీన ఉదయస్తమాన సేవా టికెట్లను భక్తులకు అందుబాటులో ఉంచుతామని, ఆశక్తి ఉన్న భక్తులు ఆన్‌లైన్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చని ఈవో జవహర్ తెలిపారు.
TTD Temple: శ్రీవారి భక్తులకు డబుల్ గుడ్ న్యూస్

Ttd