Site icon HashtagU Telugu

TTD: టీటీడీ రక్షణ చర్యలు, భక్తులకు చేతికర్రల పంపిణీ

Tirumala Alipiri

Tirumala Alipiri

TTD: తిరుమల నడకదారిలో ఇటీవల చిరుత పులుల దాడుల నేపథ్యంలో తితిదే రక్షణ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా భక్తులకు చేతికర్రలను అందుబాటులోకి తెచ్చింది. బుధవారం అలిపిరి మెట్ల మార్గం వద్ద చేతి కర్రల పంపిణీ కార్యక్రమాన్ని తితిదే ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి, ఈవో ధర్మారెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘చేతిలో కర్ర ఉంటే జంతువులు రావని శాస్త్రీయ వాదన. నడిచి వెళ్లే భక్తులకు ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. చేతి కర్రలు చేతులు దులుపుకొనే ప్రక్రియ కాదు. మెట్ల మార్గంలో తితిదే భద్రత సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారు. చేతి కర్ర ఒక్కటే ఇచ్చి మా పని అయిపోయింది అనుకోవడం లేదు. విమర్శలు వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం’’ అని కరుణాకర్‌రెడ్డి అన్నారు.

Also Read: Errabelli Dayakar Rao: కేసీఆర్ కు మోసం చేస్తే క‌న్న‌త‌ల్లికి మోసం చేసిన‌ట్లే!