Hyderabad: ఐటీ మహిళ ఉద్యోగులకు ఆర్టీసీ గుడ్ న్యూస్

తెలంగాణలో మహిళా ప్రయాణికులకు ఆర్టీసీ పెద్దపీట వేస్తుంది. ఇప్పటికే వారికి షీషటల్స్ పేరుతో ప్రత్యేక బస్సుల్ని నడుపుతుంది. తాజాగా మరో నిర్ణయం తీసుకుంది.

Hyderabad: తెలంగాణలో మహిళా ప్రయాణికులకు ఆర్టీసీ పెద్దపీట వేస్తుంది. ఇప్పటికే వారికి షీషటల్స్ పేరుతో ప్రత్యేక బస్సుల్ని నడుపుతుంది. తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. నగరంలోని ఐటీ కారిడార్లో మెట్రో ఎక్స్‌ప్రెస్ లేడీస్ స్పెషల్ బస్సు సర్వీసును నడుపుతోంది. జూలై 31 నుంచి ఐటీ కారిడార్లో ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. జెఎన్‌టియు (JNTU) నుండి వేవ్ రాక్ వరకు నడుస్తుంది. జెఎన్‌టియు నుండి ఉదయం 9 గంటల నుండి బయలుదేరే బస్సు ఫోరం/నెక్సస్ మాల్, హైటెక్ సిటీ, మైండ్‌స్పేస్, రాయదుర్గ్, బయో డైవర్సిటీ పార్క్, గచ్చిబౌలి ‘ఎక్స్’ రోడ్, ఇందిరా నగర్, ఐఐటి ‘ఎక్స్’ రోడ్, విప్రో సర్కిల్ మీదుగా ప్రయాణిస్తుంది. ఆఫీసు వేళల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా సాఫ్ట్వేర్ ఉద్యోగులు ప్రయాణించవచ్చు. నగరంలోని ఐటీ కంపెనీల్లో ఐదు లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ మేరకు మరిన్ని సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురానుంది.

Also Read: Uttarpradesh: 7 నెలల చిన్నారి కడుపులో రెండు కిలోల పిండం.. ఫొటోస్ వైరల్?