TSRTC JAC: కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించిన టీఎస్ఆర్టీసీ జేఏసీ

తెలంగాణ ఎన్నికలకు ముందు టీఎస్ఆర్టీసీ జేఏసీ అధికార పార్టీ బీఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చింది. కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది

Published By: HashtagU Telugu Desk
Tsrtc Jac

Tsrtc Jac

TSRTC JAC: తెలంగాణ ఎన్నికలకు ముందు టీఎస్ఆర్టీసీ జేఏసీ అధికార పార్టీ బీఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చింది. కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

బిఆర్‌ఎస్ కి షాక్ ఇస్తూ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (జెఎసి) కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆర్టీసీ జెఎసి కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించడంతో బీఆర్ఎస్ పార్టీకి పెద్ద షాక్ తగిలినట్లైంది. వనపర్తి నియోజకవర్గం నుండి పోటీ చేయాల్సిన బిజెపి మాజీ సభ్యుడు, జెఎసి అధ్యక్షుడు అశ్వత్థామ రెడ్డి ఇటీవల నవంబర్ 22న తన రాజీనామాను సమర్పించారు. కాగా తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు జరగనుండగా.. డిసెంబర్ 3న కౌంటింగ్ జరగనుంది.

Also Read: Constitution Day: రాజ్‌భవన్‌లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

  Last Updated: 27 Nov 2023, 02:18 PM IST