Site icon HashtagU Telugu

TS SSC Results 2023: టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపు టెన్త్‌ క్లాస్‌ ఫలితాలు విడుదల..!

Telangana DSC Results

Telangana DSC Results

TS SSC Results: తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫలితాల (TS SSC Results)ను రేపు విడుదల చేయనున్నారు. మంత్రి సబితా ఇంద్రా రెడ్డి రిజల్ట్స్‌ను ప్రకటిస్తారని అధికారులు వెల్లడించారు. ఈసారి 7,39,493 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరయ్యారు. తెలంగాణ 10వ తరగతి ఫలితాలు (TS SSC Results 2023) మే 10వ తేదీన విడుదల కానున్నట్లు అధికారులు తెలిపారు.  కాగా నేడు(మంగళవారం) ఇంటర్‌ ఫలితాలు విడుదలయ్యాయి. రేపు టెన్త్‌ ఫలితాలు రిలీజ్‌ కానుండడం విశేషం.

Also Read: TSRTC: మహిళలకు టీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్!

రాష్ట్రంలో ఏప్రిల్‌ 3వ తేదీన పదో తరగతి పరీక్షలు ప్రారంభించారు. ఏప్రిల్ 11తో ప్రధాన పరీక్షలు ముగియగా.. ఏప్రిల్ 11తో ఒకేషనల్ పరీక్షలు, ఏప్రిల్ 13తో ఓరియంటెల్ పరీక్షలు ముగిశాయి. మూల్యాంకన ప్రక్రియ కూడా ఇప్పటికే పూర్తయిన విషయం తెలిసిందే. విద్యార్థులు TS 10th Results 2023 విడుదలయ్యాక http://bse.telangan.gov.in/ లేదా http://www.manabadi.co.in/ వెబ్‌సైట్‌లలో చెక్‌ చేసుకోవచ్చు. తెలంగాణలో మొత్తం 7,39,493 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. TS SSC పరీక్ష 2023 క్లియర్ చేయడానికి, విద్యార్థులు ప్రతి సబ్జెక్ట్‌లో కనీసం 35 మార్కులను సాధించాలి. క్లియర్ కాని వారు సప్లిమెంటరీ పరీక్షలకు హాజరవుతారు. మెయిన్‌ బోర్డ్‌ ఎగ్జామ్‌ ఫలితాలు వెలువడిన తర్వాత వాటికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తారు.