Site icon HashtagU Telugu

TS Betting:తెలంగాణలో కోడి పందేలు

cock fight

cock fight

ఆంధ్రప్రదేశ్ కి మాత్రమే పరిమితమైన కోడిపందేల సంస్కృతి తెలంగాణాకి కూడా విస్తరించింది. ముఖ్యంగా తెలంగాణ, ఏపీ సరిహద్దు ప్రాంతాల్లో కోడి పందేలు, బెట్టింగ్ లు జోరుగా సాగాయి.

ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు హైదరాబాద్‌ నుండి కూడా పందెంరాయుళ్లు సరిహద్దుకు తరలివచ్చారు. అశ్వారావుపేట, సత్తుపల్లి, మధిర మండలాల్లో కోడి పందేలు జరిగే ప్రాంతాలకు పందెం కాసేవాళ్ళు పెద్ద సంఖ్యలో వచ్చారు. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి మండలాల మీదుగా ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలోని అన్ని మండలాల్లో నిర్వహించే కోడిపందేల స్థావరాలకు కూడా పందెం కాసేవాళ్ళు వచ్చినట్టు సమాచారం.

కొమరం భీం ఆసిఫాబాద్ జిలాల్లో కూడా పలువురు కోడిపందేలు ఆడుతూ పట్టుబట్టినట్లు సమాచారం. తెలంగాణాలో పలు జిల్లాల్లో కోడి పందేలు నిర్వహిస్తూ, అరెస్ట్ అయిన వారందరిపై ప్రభుత్వం కేసులు పెట్టి కౌన్సిలింగ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Exit mobile version