ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) TS ECET-2024కు సంబంధించిన నోటిఫికేషన్ (Notification)ను విడుదల చేసింది. డిప్లొమా, బీఎస్సీ (మ్యాథ్స్) చదువుతున్న విద్యార్థులు ఇంజినీరింగ్‌లో చేరాలంటే ఇందులో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఈ నెల 15వ తేదీ నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. మే 6వ తేదీన పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఫీజు SC, ST, పీహెచ్ అభ్యర్థులకు రూ.500, ఇతరులకు రూ.900. ఆలస్య రుసుం రూ. 500తో ఏప్రిల్ 22 వరకు, రూ. 1000తో ఏప్రిల్ 28వ తేదీ లోపు దరఖాస్తులను సమర్పించొచ్చని పేర్కొన్నారు. అయితే.. ఏప్రిల్ 24 నుంచి 28వ తేదీ మధ్యలో అభ్యర్థులు తమ దరఖాస్తులను ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నారు. మే 1వ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మే 6వ తేదీన ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాతపరీక్ష నిర్వహించనున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇదిలా ఉంటే.. జేఈఈ మెయిన్స్ (JEE Mains) సెషన్-1 2024 పరీక్షా ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో 23 మంది విద్యార్థులు వంద శాతం మార్కులతో అదరగొట్టగా.. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పది మంది విద్యార్థులు ఉండటం విశేషం. ఎన్టీఏ విడుదల చేసిన ఫస్ట్ పేపర్ బీఈ, బీటెక్ ఫలితాల్లో దేశవ్యాప్తంగా 23 మంది విద్యార్థులు 100 శాతం స్కోర్ సాధించగా.. ఇందులో 10 మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఉన్నారు. వీరిలో తెలంగాణాకు చెందిన రిషి శేఖర్ శుక్లా, పబ్బ రోహన్ సాయి, ముతవరకు అనూప్, హుందేకర్ విదిత్, మదినేని వెంకట సాయి తేజ, కల్లూరి శ్రియాషస్ మోహన్, తవ్వ దినేష్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన షేక్ సూరజ్, తోట సాయి కార్తీక్, అన్నారెడ్డి వెంకట తనీశ్ రెడ్డిలు వంద శాతం స్కోరును సాధించి తెలంగాణ ఖ్యాతిని పెంచారు.
Read Also : Megastar Chiranjeevi : మెగాస్టార్ డిజిటల్ ఎంట్రీ.. వెబ్ సీరీస్ తో షాక్ ఇవ్వనున్న చిరు..!