TS DSC Final Answer Key 2024 Released : డీఎస్సీ అభ్యర్థులు (DSC Candidates) ఎదురుచూస్తున్న తెలంగాణ డీఎస్సీ పరీక్షల ఫైనల్ ‘కీ’ (Telangana DSC final key ) శుక్రవారం విడుదలైంది. స్కూల్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్‌సైట్‌లో కీలు, రెస్పాన్స్‌షీట్స్‌ను అందుబాటులో ఉంచినట్లు పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు. ప్రాథమిక కీ ఆగస్టు 13వ తేదీన విడుదలైన సంగతి తెలిసిందే. ఆగస్టు 20వ తేదీలోగా అభ్యంతరాలు స్వీకరించారు. ఫైనల్ ‘కీ’ని ఈరోజు విడుదల చేశారు.
మరికొద్ది రోజుల్లోనే డీఎస్సీ ఫలితాలను (TS DSC Result 2024) విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు 2,45,263 మంది హాజరయ్యారు. ఈ ఫైనల్ కీ ద్వారా డీఎస్సీ అభ్యర్థులు తమ మార్కులను తెలుసుకోవచ్చు. త్వరలోనే ఫలితాలు విడుదల చేసే ఛాన్స్ ఉంది.
Read Also : Nithiin Welcomed His First Child : పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన నితిన్ భార్య..