Trump: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నాలుగేళ్లుగా కొనసాగుతుండగా, ప్రపంచ దేశాల ప్రయత్నాలు ఇప్పటివరకు పెద్దగా ఫలితాన్నివ్వలేకపోయాయి. ఈ యుద్ధాన్ని ఆపేందుకు అనేక అంతర్జాతీయ నాయకులు చర్చలు జరిపినప్పటికీ, సంతృప్తికర పరిష్కారం దొరకలేదు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా యుద్ధాన్ని ఆపేందుకు రష్యా, ఉక్రెయిన్ నేతలతో చర్చలు జరిపారు. అయినా పరిస్థితిలో మార్పు రాలేదని, దీంతో అమెరికా ఈ సమస్యపై విసుగుతో ఉంది.
తాజాగా ఈ యుద్ధంపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని చిన్న పిల్లల మధ్య జరిగే గొడవలతో పోల్చారు. “వాళ్లు చిన్న పిల్లల్లా కొట్టుకుంటున్నారు.. కొంతకాలం అలాగే ఉంచితేనే శాంతి ఎలా వస్తుందో తెలుస్తుంది,” అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, ప్రపంచంలో యుద్ధాన్ని ఆపగల శక్తి తనకే ఉందని చెబుతూ, జర్మన్ ఛాన్సలర్ మెర్జ్ చేసిన ప్రశంసలను స్వీకరించారు.
HYDRAA : బేగంపేట, ప్యాట్నీ సెంటర్ లలో హైడ్రా కూల్చివేతలు..భారీగా ట్రాఫిక్ జాం
ట్రంప్, జర్మనీ కొత్త ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ మధ్య వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్‌లో జరిగిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ, “ఈ యుద్ధం ద్వేషంతో పోరాడే చిన్న పిల్లల మాదిరిగా ఉంది. నేను పుతిన్‌కి ఫోన్ చేసి కూడా ఇదే చెప్పాను. అయితే, నేను అంతగా జోక్యం చేయలేను. జర్మనీ కూడా ఈ సమస్య పరిష్కారంలో పాత్ర పోషించాలి,” అని సూచించారు.
ఈ క్రమంలో అమెరికా మధ్యవర్తిగా సౌదీ అరేబియాలో రష్యా అధికారులతో చర్చలు కూడా చేపట్టింది. అయితే ఆ చర్చల సమయంలో రష్యా కొన్ని షరతులు పెట్టడంతో చర్చలు స్తబ్ధతకు చేరాయి. తాజా పరిణామాల్లో, ఇస్తాంబుల్‌లో మరోసారి చర్చలు మొదలయ్యేందుకు సిద్ధమైన వేళ, ఉక్రెయిన్ ఆకస్మికంగా రష్యా పై డ్రోన్ దాడులు జరిపింది. ఈ దాడుల్లో రష్యా వైమానిక స్థావరాలపై తీవ్ర నష్టం జరిగినట్టు తెలుస్తోంది. అనేక బాంబర్లను ఉక్రెయిన్ ధ్వంసం చేసినట్టు సమాచారం. అయితే ఇప్పటివరకు రష్యా నుంచి ప్రతీకార దాడి చేపట్టలేదు. ఈ పరిణామాలతో యుద్ధ పరిస్థితి మరింత సంక్షోభంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
Talliki Vandanam : విద్యార్థులు ఈ పత్రాలు అందజేస్తేనే తల్లికి వందనం డబ్బులు