Site icon HashtagU Telugu

Trsv Leaders: మొక్కలు నాటిన టీఆర్ఎస్వీ నాయకులు

Trsv1

Trsv1

తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జన్మదిన వేడుకలను పురస్కరించుకొని, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా టీఆర్ఎస్వీ నాయకులు ఓయూలో మొక్కలు నాటారు. ఉస్మానియా యూనివర్సిటీలో టిఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేల్పుకొండ వెంకటేష్   ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి తో కలిసి గ్రీన్ చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పిడమర్తి రవి మాట్లాడుతూ పల్లెలను సైతం ప్రగతి పతంలో నడిపిస్తూ పంచాయతీరాజ్ శాఖ ను అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారని అన్నారు. పంచాయతీరాజ్ శాఖలో 10 అవార్డులు తెలంగాణకు రావడం గర్వకారణమన్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్వి రాష్ట్ర సీనియర్ నాయకులు టైగర్ గోపగాని రఘురాం, చింత  కుమార్,  కళ్లెం వెంకటేష్, క్యాదాసి రవి,చటారి దశరథ్, కాటం శివ, రమేష్,దేవరకొండ నరేష్, జొగు గణేష్, చాగంటి రాజేష్,వేల్పుకొండ రామకృష్ణ, సందీప్, మిద్దె సురేష్, మీసాల మహేష్, ధర్మారపు   సందీప్, బరిగేల రాజు పాల్గొన్నారు.

Exit mobile version