Site icon HashtagU Telugu

Kavitha: ఉగాది పచ్చడి చేసిన ఎమ్మెల్సీ కవిత…ఫోటోలు వైరల్..!!

Kavitha

Kavitha

ఉగాది….ఈ రోజున ప్రతి తెలుగు లోగిలిలో ప్రత్యేక వేడుకలు కనిపిస్తుంటాయి. ఉగాది వేడుకలకు సంబంధించి ఒక్కో ఇంటికి ఒక్కో ప్రత్యేకత కనిపిస్తుంది. పచ్చడి మాత్రం అన్ని ఇళ్లల్లోనూ తప్పనిసరి ఉంటుంది. షడ్రుచుల సమ్మేళనంతో కూడిన పచ్చడి ఉగాది పండుగ ప్రత్యేకం.

ఈ ఏడాది శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉగాది వేడుకలను పురస్కరించుకుని టీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్వయంగా ఉగాది పచ్చడి తయారు చేశారు. హైదరాబాద్ లోని తన ఇంట్లో పూజా గదిలో కూర్చుని ఉగాది పచ్చడిని తయారు చేశారు. ఇప్పటికే తెలంగాణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ వీడియోను విడుదల చేశారు. ఇప్పుడు తాజాగా ఉగాది పచ్చడిని తయారు చేశారు. ఈ ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

Exit mobile version