Site icon HashtagU Telugu

KCR: ఢిల్లీలో ర‌చ్చ రేపుతున్న కేసీఆర్ పోస్ట‌ర్లు

Kcr55

Kcr55

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 68వ పుట్టినరోజు వేడుక‌లు, నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఘ‌నంగా జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో హైద‌రాబాద్‌తో పాటు ప‌లు ప్రాంతాల్లో కేసీఆర్ పోస్ట‌ర్లు ఏర్పాటు చేశారు. అయితే ఇక్క‌డ షాకింగ్ మ్యాట‌ర్ ఏంటంటే.. సీఎం కేసీఆర్ పోస్ట‌ర్లు ఇప్పుడు ఢిల్లీలో కూడా ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ఈ క్ర‌మంలో తాజాగా కేసీఆర్ అభిమానులు పెద్దయెత్తున ఆయ‌న పోస్ట‌ర్లు అంటించ‌డం డిల్లీలో క‌ల‌క‌లం రేపుతోంది.

ఇక కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి, దేశ రాజ‌కీయాల్లోకీలక భూమిక పోషించాలంటూ కేసీఆర్ అభిమానులు, టీఆర్ఎస్ శ్రేణులు ఈ పోస్టర్లను ఏర్పాటు చేశారు. ఢిల్లీలో కేసీఆర్ ఫ్యాన్ క్లబ్ ఏర్పాటు చేసిన ఈ పోస్టర్లలో కేసీఆర్ ఆఫ్ విజన్ ఆఫ్ ఇండియా పోస్ట‌ర్లు ఎక్కువ‌గా దర్శనమిస్తున్నాయి. ఈరోజు కేసీఆర్ పుట్టినరోజు కావడంతో టీఆర్ఎస్ నేతలు ఈ పోస్టర్లు ఏర్పాటు చేసినా, గతంలో కంటే ఈసారి భిన్నంగా ఈ పోస్ట‌ర్లు కన్పిస్తున్నాయి. ఇక‌పోతే కేసీఆర్ జాతీయ రాజకీయాలపై అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. జాతీయ‌స్థాయిలో బీజేపీకి బీజేపీకి వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటు చేసి కేంద్రంలో చ‌క్రం తిప్పేందుకు కేసీఆర్ ప్ర‌య‌త్నాలు షురూ చేశారు.

Exit mobile version