ఆంధ్రప్రదేశ్‌లో నూతన కూటమి ప్రభుత్వం (AP Govt) ఏర్పడిన తర్వాత కీలక పరిపాలన మార్పులకు తెరలేవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నతాధికారుల బదిలీలు (Transfers ) మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జిల్లాల కలెక్టర్ల మార్పులపై ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చింది. ఇప్పటికే పలు జిల్లాల కలెక్టర్ల బదిలీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా కలెక్టర్‌గా చెరుకూరి శ్రీధర్‌ను నియమించే అవకాశముంది.
Covid-19: సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఆటగాడికి కరోనా.. రేపు జట్టులో జాయిన్?!
కలెక్టర్ల బదిలీల తర్వాత ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలపై దృష్టిసారించనుంది. గత కొన్ని నెలలుగా విధుల్లో ఉన్న అధికారులను బదిలీ చేసి, కొత్త బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధంగా ఉంది. 2016 బ్యాచ్ ఐఏఎస్‌లలో ఇప్పటివరకు కలెక్టర్ పోస్టింగ్ రాని వారికి ఈసారి అవకాశం కలిగే అవకాశం ఉంది. ఇది వారి కెరీర్‌లో కీలక మైలురాయిగా నిలవనుంది.
అదే సమయంలో 2017 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారులను తొలిసారిగా కలెక్టర్లుగా నియమించే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కూటమి ప్రభుత్వం మొదటి ఏడాది పాలన పూర్తయ్యేలోపు ఈ మార్పులను అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బదిలీలతో జిల్లాల పరిపాలనలో గణనీయమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.