Ips Officers : తెలంగాణలో పది మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. 2021, 2022 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్లకు అడిషనల్ ఎస్పీలుగా పోస్టింగులు ఇచ్చారు. గ్రేహౌండ్స్ ఏఎస్పీలుగా పని చేస్తున్న కాజల్ ను ఉట్నూర్ ఏఎస్పీగా, రాహుల్ రెడ్డిని భువనగిరి ఏఎప్పీగా, చిత్తరంజన్ ను ఆసిఫాబాద్ ఏఎస్పీగా, చైతన్య రెడ్డిని కామారెడ్డి ఏఎస్పీగా, చేతన్ నితిన్ ను జనగామ ఏఎస్పీగా, విక్రాంత్ కుమార్ సింగ్ ను భద్రాచలం ఏఎస్పీగా, శుభమ్ ప్రకాశ్ ను కరీంనగర్ రూరల్ ఏఎస్పీగా, రాజేశ్ మీనాను నిర్మల్ ఏఎస్పీగా, మౌనికను దేవరకొండ ఏఎస్పీగా బదిలీ చేశారు. భద్రాచలం ఏఎస్పీ అంకిత్ కుమార్ ను డీజీపీ ఆఫీస్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.
1. ఉట్నూర్ ఏఎస్పీగా కాజల్.
2. కంకణాల రాహుల్ రెడ్డి రాచకొండ భోంగీర్ ఏఎస్పీగా బదిలీ అయ్యారు.
3. ఆసిఫాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్ ఏఎస్పీగా చిత్రరంజన్ బదిలీ అయ్యారు.
4. బొక్కా చైతన్య కామారెడ్డి ఏఎస్పీగా నియమితులయ్యారు.
5. చేతన్ నితిన్ వరంగల్ జనగామ ఏఎస్పీగా బదిలీ అయ్యారు.
6. విక్రాంత్ కుమార్ సింగ్ భద్రాచలం, బి.కొత్తగూడెం ఏఎస్పీగా నియమితులయ్యారు.
7. అంకిత్ కుమార్ సంఖ్‌వార్‌ను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ అదేశాలు జారీ చేశారు.
8. కరీంనగర్ రూరల్ ఏఎస్పీగా నాగ్రాలే శుభం ప్రకాష్ బదిలీ అయ్యారు.
9. రాజేష్ మీనా నిర్మల్ ఏఎస్పీగా బదిలీ అయ్యారు.
10. పి.మౌనికను నల్గొండ దేవరకొండ ఏఎస్పీగా బదిలీచేశారు.
Read Also: Mega vs Allu : అల్లు అర్జున్ కంటే రామ్ చరణ్ తోపా ?