Congress MLA Wife: తెలంగాణలో విషాదం చోటుచేసుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంట తీవ్ర విషాం నెలకొంది. వివరాల్లోకి వెళ్తే.. చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య (Congress MLA Wife) రూపా దేవి ఆత్మహత్య చేసుకుంది. అల్వాల్ లోని పంచశీల కాలనీలో ఇంట్లో ఉరి వేసుకుని రూపా దేవి సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఓ పాఠశాలలో రూపా దేవి ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే రూపా దేవి మృతదేహాన్ని రేనోవ హాస్పిటల్ నుండి అంబులెన్స్‌లో పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి మార్చురీకి పోలీసులు తరలించారు. ఎమ్మెల్యే భార్య మరణవార్త వినగానే స్థానిక నాయకులు, కీలక నేతలు ఎమ్మెల్యే ఇంటికి చేరుతున్నారు.
అనారోగ్య సమస్యల కారణమా..?
చొప్పదండి ఎమ్మెల్యే భార్య రూపాదేవి అనారోగ్య సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక నిర్ధారణైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమె కుటుంబ సభ్యుల నుంచి పోలీసులు వివరాలు ఆరా తీస్తున్నారు. రెండు సంవత్సరాల నుంచి రూపా దేవి తీవ్ర కడుపునొప్పి సమస్యతో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. గత రెండు రోజులుగా స్కూల్ కి సెలవు తీసుకున్న రూపా దేవి ఇంట్లోనే ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు రూపా దేవి కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేశారు.
Also Read: PM Suraksha Bima Yojana: రూ. 20 వార్షిక ప్రీమియంతో రూ.2 లక్షల బీమా.. పూర్తి వివరాలివే..!
మంత్రి పొన్నం పరామర్శ
మేడిపల్లి సత్యం సతీమణి రూపా దేవి ఆకస్మిక మరణ వార్త తెలియగానే మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నుండి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి అర్థరాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. అల్వాల్ లోని పంచశీల కాలనీలో ఉన్న మేడిపల్లి సత్యం నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. రాత్రి అంతా మేడిపల్లి సత్యం నివాసంలోనే ఎమ్మేల్యే కవ్వంపల్లి సత్యనారాయణలతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ అక్కడే ఉండి వారికి అండగా ఉన్నారు.
We’re now on WhatsApp : Click to Join