ఏం కొనేటట్లు లేదు.. ఏం తినేటట్లు లేదు.. ఈ పాట మనం అందరం ఏన్నో సార్లు వినుంటాం. అయితే.. ప్రస్తుతం ప్రజల పరిస్థితి అలానే మారింది. సామాన్య ప్రజలను ఏవస్తువు వదిలిపెట్టడం లేదు..ఎక్కడ కూడా తగ్గేదెలా అంటూ ధరల మోత మోగిస్తున్నాయి. మొన్నటి వరకు టమాటా ధరలు ఆకాశానికి అంటగా..ఇప్పుడు కందిపప్పు నేను కూడా అంతే అంటూ డబుల్ సెంచరీకి వెళ్తుంది. కందిపప్పు వల్ల… జీర్ణక్రియ మెరుగవుతుంది, మలబద్ధకం సమస్య తీరుతుంది, గుండెకు సంబంధించిన సమస్యల్ని కందిపప్పు నివారిస్తుంది… గుండెకు వ్యాధులు రాకుండా కాపాడుతుందని ఆరోగ్య నిపుణులు చెపుతుంటారు. దీంతో మారే ఏ పప్పుకు లేని డిమాండ్ కందిపప్పును ఏర్పడుతుంది. దీంతో కందిపప్పు (Toor Dal) ధర రోజు రోజుకు పెరుగుతుంది. అసలు డైలీ కందిపప్పు తినేవారు కూడా ఉన్నారు. ఇలాంటి ఈ సమయంలో కందిపప్పు ధర పెరుగుతుండడం సామాన్య ప్రజలను గగ్గోలు పెట్టిస్తుంది.
Read Also : CM KCR: ఎన్నికలే లక్ష్యంగా కేసీఆర్ దూకుడు, వీవోఏలకూ వరాలు
ఏపీ (AP)లో గత 8 నెలల్లో కందిపప్పు ధర 55 శాతం ధర పెరిగింది. ప్రస్తుతం కిలో రూ. 160-170 మధ్య పలుకుతుండగా, బ్రాండెడ్ కందిపప్పును రూ. 180కిపైనే విక్రయిస్తున్నారు. మున్ముందు ధర రూ. 200 దాటే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. సాగు తగ్గడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. ఒక్క ఏపీలోనే కాదు అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. ఈ ఏడాది జనవరిలో కిలో కందిపప్పు (Toor Dal Price) ధర రూ. 98 నుంచి రూ.110 వరకు ఉంది. ఆగస్టులో రూ. 170కి చేరుకుంది. అంటే గత 8 నెలల్లో 55 శాతం పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో గతంలో గరిష్ఠంగా 8.50 లక్షల ఎకరాల్లో కందిపప్పు సాగుచేసేవారు. గతేడాది ఇది 6 లక్షల ఎకరాలకు పడిపోయింది. ఈ పంట ద్వారా 1.09 లక్షల టన్నుల ఉత్పత్తి వస్తుందని అంచనా వేయగా, వర్షాల కారణంగా దిగుబడులు పడిపోయాయి.
Read Also: IT Notice : చంద్రబాబు కు ఐటీ నోటీసులు..?
మరోవైపు, ఈ ఏడాది కందిసాగు దారుణంగా పడిపోయింది. ఆగస్టు నెలాఖరు నాటికి 292 లక్షల ఎకరాల్లోనే సాగు చేశారు. దేశవ్యాప్తంగానూ కంది సాగు గణనీయంగా తగ్గడం కూడా ధరల పెరుగుదలకు కారణంగా మార్కెట్ వర్గాలు చెపుతున్నాయి. ఏది ఏమైనప్పటికి కందిపప్పు ధర రోజు రోజుకు పెరగడం అనేది సామాన్య ప్రజలను కన్నీరు పెట్టిస్తుంది. టమాటా విషయంలో ఎలాగైతే సబ్సిడీ ఇచ్చి ఆదుకున్నారో..కందిపప్పు విషయంలో కూడా అలాగే చేయాలనీ ప్రభుత్వాలను సామాన్య ప్రజలు కోరుకుంటున్నారు.