Site icon HashtagU Telugu

TONIQUE : లిక్కర్ మార్ట్ టానిక్ ఎలైట్ వైన్ షాపు సీజ్

Tonic Elite Wine Shop Will

Tonic Elite Wine Shop Will

జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబర్‌ 36లోని టానిక్‌ ఎలైట్‌ వైన్‌ షాపు (TONIQUE ) యాజమాన్యానికి ఎక్సైజ్ శాఖ అధికారులు షాక్ ఇచ్చింది. లైసెన్స్ గడువు ముగియడంతో అధికారులు సీజ్ చేయనున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టానిక్​కు ఏ4 ఎలైట్ కింద లైసెన్స్ జారీ చేసింది. రాష్ట్రంలో ఏ వైన్​ షాపుకు లేని విధంగా విదేశీ మద్యం బ్రాండ్ల అమ్మకాలకు టానిక్​కు గత ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. అయితే టానిక్ లిక్కర్ మార్ట్‌లో అవకతవకలు జరిగినట్లు కమర్షియల్ టాక్స్ అధికారులు గుర్తించారు.

We’re now on WhatsApp. Click to Join.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తనిఖీలు నిర్వహించింది. ఇది ఎక్సైజ్ పాలసీకి పూర్తి విరుద్ధంగా ఉందని తేలింది. ప్రస్తుతం టానిక్ సంస్థకు హైదరాబాద్ వ్యాప్తంగా 11 ఫ్రాంచైజీలు ఉండగా.. క్యూ బై టానిక్ పేరుతో మద్యం విక్రయాలు కొనసాగిస్తున్నారు. ప్రపంచంలోని ఎంత ఖరీదైన బ్రాండ్ మద్యం అయినా ఇక్కడ లభిస్తుంది. ఈ టానిక్ చైన్ బీఆర్ఎస్ ఫ్యామిలీలోని ఓ కీలక సభ్యుడి బినామీ సంస్థ అని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాల్ మూసివేత చర్చనీయాంశంగా మారింది.

Read Also : Rain Effect : తెలంగాణ లో రేపు విద్యాసంస్థలకు సెలవు