Site icon HashtagU Telugu

TG Cabinet : మధ్యాహ్నం తెలంగాణ కేబినెట్‌ భేటీ

Tg Cabinet (1)

Tg Cabinet (1)

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్‌లో రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది. అయితే.. ఇవాళ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. సభలో మూడు ప్రభుత్వ బిల్లులు ఆమోదం పొందాల్సి ఉంది. వాటిలో న్యాయ శాఖకు చెందిన రెండు సవరణ బిల్లులు ఉండగా.. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బిల్లు కూడా ఉంది. అయితే.. ఇప్పటికే న్యాయ శాఖ బిల్లులు సభలో ప్రవేశ పెట్టిన సర్కార్.. నేడు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బిల్లు సభలో ప్రవేశపెట్టనుంది. అయితే.. యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ బిల్లును మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రవేశపెట్టనున్నారు. అంతేకాకుండా.. ఈరోజు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో హైదరాబాద్ అభివృద్ధిపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. ఇదేకాకుండా.. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేట వద్ద యంగ్ ఇండియా స్కిల్​ యూనివర్సిటీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భూమిపూజ చేయనున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

అయితే.. అసెంబ్లీ సమావేశానికి అనుబంధంగా, ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు కమిటీ హాల్ 1లో క్యాబినెట్ సమావేశం జరగనుంది. కొత్త రేషన్ కార్డుల గురించి చర్చలు మరియు సంబంధిత విధానాలను క్రమబద్ధీకరించడానికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుపై చర్చలు ప్రధాన అజెండాలో ఉన్నాయి. వైద్య శాఖ జీవన్ దాన్ చొరవను పరిష్కరిస్తుంది, అయితే పట్టణ ప్రణాళిక చర్చలు మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు మరియు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలోని గ్రామాల విలీనం చుట్టూ తిరుగుతాయి.

అదనంగా, ఈ విలీనాలకు సంబంధించిన బిల్లును రేపు సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు రాష్ట్ర పౌరులకు ప్రయోజనం చేకూర్చేందుకు ఉద్దేశించిన ముఖ్యమైన సమస్యలు మరియు శాసనపరమైన చర్యలతో నిమగ్నమవ్వడానికి ప్రభుత్వం యొక్క చురుకైన విధానాన్ని సూచిస్తాయి.

ఇదిలా ఉంటే.. నిన్న అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళం నెలకొంది. బీఆర్‌ఎస్‌ మహిళా ఎమ్మెల్యేలను సీఎం రేవంత్‌ రెడ్డి కించపరిచేవిధంగా మాట్లాడరంటూ బీఆర్‌ఎస్‌ శ్రేణులు నిరసనలు దిగారు. మాట్లాడేందుకు సమయం ఇవ్వడం లేదని.. మైక్‌ ఇవ్వాలంటూ స్పీకర్‌ పోడియం వద్దకు వెళ్లి నిరసనలు తెలిపారు. గందరగోళం మధ్య స్పీకర్‌ అసెంబ్లీని వాయిదా వేశారు.

Read Also : BCCI Meeting IPL Owners: ఐపీఎల్ జ‌ట్ల య‌జ‌మానుల‌తో బీసీసీఐ స‌మావేశం.. మెగా వేలం ఉంటుందా..? లేదా..?