2000 Rupees Note : ఈరోజే అక్టోబర్ 7. మీ దగ్గర రూ. 2వేల నోట్లు ఉంటే వెంటనే బ్యాంకు లేదా పోస్టాఫీసుకు వెళ్లి వాటిని మార్చేసుకోండి. ఎందుకంటే ఈ రోజు తర్వాత బ్యాంకుల్లో ఆ నోట్లను తీసుకోరు. 2వేల నోట్ల మార్పిడికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించిన గడువు నేటితో ముగియబోతోంది. ఇక రేపటి (అక్టోబరు 8) నుంచి 2వేల రూపాయల నోట్లను మార్చుకోవడానికి ఒక ఆప్షన్ ఉంది. రాష్ట్రంలోని రిజర్వ్ బ్యాంక్ రీజినల్ ఆఫీసుల్లో మాత్రమే 2వేల నోట్లను తీసుకుంటారు. ఆర్‌బీఐకి దేశవ్యాప్తంగా 19 ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. ఈ ఆఫీసుల్లో పింక్ నోట్లను డిపాజిట్ చేయడానికి లేదా ఎక్స్‌చేంజ్ చేసుకోవడానికి 2 ఆప్షన్లు ఉన్నాయి. మొదటి ఆప్షన్ ఏమిటంటే.. ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లి రూ. 2000 నోట్లను మార్చుకోవచ్చు. అయితే ఒకసారి 20,000 రూపాయలను మాత్రమే మార్పిడి చేసుకోగలరు.
We’re now on WhatsApp. Click to Join
రెండో పద్ధతి ఏమిటంటే.. రూ. 2000 నోట్లను ఇండియన్ పోస్టల్ డిపార్ట్‌మెంట్ ద్వారా ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయానికి పంపొచ్చు. ఆ మొత్తం ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయానికి చేరిన తర్వాత మీ అకౌంట్లో డబ్బు జమ అవుతుంది. కోర్టులు లేదా చట్టపరమైన సంస్థలు, చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలు, దర్యాప్తులో పాల్గొనే సంస్థలు లేదా అమలులో పాలుపంచుకున్న పబ్లిక్ అథారిటీలు కూడా రూ. 2000 నోట్లను దేశంలో ఉన్న RBI ప్రాంతీయ కార్యాలయాల్లో డిపాజిట్ చేయొచ్చు. నోట్లు డిపాజిట్ చేయడానికి ఆయా సంస్థలకు పరిమితి లేదు. అయితే ఇందుకోసం ప్రతిఒక్కరు తప్పనిసరిగా గుర్తింపు కార్డును (2000 Rupees Note) సమర్పించాలి.