Site icon HashtagU Telugu

Rain Alert Today : ఇవాళ ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. అతి భారీ వర్షాలు పడే ఛాన్స్

Rain Alert Today

Rain Alert Today : ఈరోజు, రేపు , ఎల్లుండి తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.  నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణ్ పేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట్, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలకు వర్షసూచన ఉంది. హైదరాబాద్ లో ఇవాళ ఆకాశం మేఘావృతమై ఉంటుంది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే ఛాన్స్ ఉంది.

Also read : Today Horoscope : సెప్టెంబరు 4 సోమవారం రాశి ఫలాలు.. వారు ఆవేశపడితే అనర్ధం

దక్షిణ కోస్తా, రాయలసీమలోని ఆ జిల్లాల్లో.. 

ఆంధ్రప్రదేశ్ లోని పలు దక్షిణ కోస్తా జిల్లాల్లో నేడు, రేపు అక్కడక్కడ తేలికపాటి జల్లులు (Rain Alert Today)  కురిసే ఛాన్స్ ఉంది. రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో రేపు, ఎల్లుండి తేలికపాటి వానలు  పడొచ్చు. తెలంగాణ – ఆంధ్రా బార్డర్ లోని కర్నూలు, నంద్యాల జిల్లాలను ఆనుకొని ఏర్పడుతున్న గాలుల సంగమం బలపడింది. దీని ప్రభావంతో రానున్న మూడు గంటల్లో కర్నూలు నగరంతో పాటుగా నంద్యాల జిల్లాలోని వివిధ భాగాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడొచ్చు. విజయనగరం జిల్లా భోగాపురం – భీమిలి మధ్య భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.