Site icon HashtagU Telugu

NTR District : తిరువూరు మండ‌లం చౌట‌ప‌ల్లిలో క్షుద్ర‌పూజ‌లు క‌ల‌కలం..అర్థ‌రాత్రి బాలుడిని వెట‌బెట్టుకుని..!

Black Magic Imresizer

Black Magic Imresizer

తిరువూరు మండ‌లం చౌట‌ప‌ల్లి గ్రామంలో క్షుద్ర‌పూజ‌లు క‌ల‌క‌లం రేపాయి. టేకులపల్లి- చౌటపల్లి గ్రామాల మధ్య లంకెబిందెలు కోసం క్షుద్ర‌పూజ‌లు చేసేందుకు ఎనిమిది మంది వ్య‌క్తులు వ‌చ్చారు. గుప్తనిధుల వేట కోసం వచ్చిన వ్యక్తుల వెంట చిన్న బాలుడు ఉన్నాడు. దీంతో నరబలి ఇవ్వడానికే బాలుడిని తెచ్చారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గుప్తనిధుల కోసం వచ్చిన 8 మందిలో నలుగురు ప‌రారుకాగా.. మ‌రో న‌లుగురిని గ్రామ‌స్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు . వీరంతా బుగ్గపాడు, తిరువూరు, ఏరుకోపాడు, టేకులపల్లి వాసులుగా గుర్తించారు.