CM Chandrababu : మదమెక్కి అన్యం పుణ్యం తెలియని చిన్నారుల బలితీసుకుంటున్నారు మానవ మృగాళ్లు. కామ వాంఛతో వావివరసలు మరిచి, ఏం చేస్తున్నామో తెలియకుండా.. శారీరక కోరిక తీర్చుకోవడానికి మృగాలకంటే ఘోరంగా ప్రవర్తిస్తున్నారు. మామయ్య అని దగ్గరికి వెళితే.. చాక్లెట్లు కొనిస్తానని నమ్మబలికి.. అత్యాచారం చేసి చప్పేశాడో దుర్మార్గుడు. ఈ ఘటన తిరుపతి జిల్లా వడమాలపేటలో చోటు చేసుకుంది. అయితే.. ఈ మూడున్నర సంవత్సరాల చిన్నారి హత్యాచారానికి గురైన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు ఆదేశించారు. వడమాలపేట మండలం ఎఎంపురం గ్రామంలో జరిగిన ఈ దారుణానికి బాధిత బాలిక కుటుంబానికి ప్రభుత్వ సాయంగా రూ.10 లక్షల సహాయం అందించాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్‌కు ఆదేశించారు సీఎం చంద్రబాబు. ఈ బాధిత కుటుంబానికి రేపు మధ్యాహ్నం రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత చెక్కు అందజేయనున్నారు.
Lucky Baskhar : అదరగొడుతున్న లక్కీ భాస్కర్.. రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే..
అయితే.. మరోవైపు, హోం మంత్రి వంగలపూడి అనిత ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, అభం శుభం తెలియని చిన్నారిని చాక్లెట్లు చూపించి దారుణానికి పాల్పడడం కరుణించదగినది కాదు అని అన్నారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించినట్లు ఆమె తెలిపారు. మృతి చెందిన బాలిక కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా సహాయంతో ఉంటుందని హోం మంత్రి అనిత ప్రకటించారు.
వివరాల్లోకి వెళితే.. వడమాలపేటలో మూడున్నర సంవత్సరాల చిన్నారి మిస్సింగ్ అయ్యింది. యువకుడు నాగరాజు, అలియాస్ సుశాంత్, పాపను చాక్లెట్లు కొనిస్తానని చెప్పి ఎత్తుకెళ్లాడు. ఆమె కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదైన వెంటనే పోలీసులు, ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు. కొద్దిసేపటికి, నిందితుడు నాగరాజును పట్టుకుని, పాప మృతదేహాన్ని పూడ్చి పెట్టిన స్థలంలో వెలికితీశారు. ఎస్పీ సుబ్బారాయుడు మాట్లాడుతూ, “చిన్నారి మామే ఈ దారుణానికి పాల్పడాడని, అన్ని ఆధారాలు సేకరించాం” అని పేర్కొన్నారు. “ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితుడికి శిక్ష పడేలా చూస్తాం” అని ఆయన తెలిపారు.
Trivikram : 2029 ఎన్నికల ముందు భారీ పొలిటికల్ సినిమా.. త్రివిక్రమ్ దర్శకత్వంలో.. హీరో ఎవరు..?