Site icon HashtagU Telugu

Cheetah: తిరుమలలో మరోసారి చిరుత కలకలం

Cheetah

Compressjpeg.online 1280x720 Image 11zon

Cheetah: అలిపిరి నడక మార్గంలో తిరుమలకు వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని తిరుమల తిరుపతి దేవస్థానం సూచించింది. ఈ నెల 24 నుంచి 27న మధ్య లక్ష్మీ నారాయణస్వామి ఆలయం నుంచి రిపీటర్ మధ్య ప్రాంతంలో చిరుత (Cheetah), ఎలుగుబంటి సంచరిస్తున్నట్లుగా ట్రాప్‌ కెమెరాలో రికార్డయ్యిందని తెలిపింది. ఈ క్రమంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ పేర్కొంది. భక్తులు గుంపులు గుంపులుగా వెళ్లాలని కోరింది. ఇటీవల కాలంలో తిరుమల నడకమార్గంలో చిరుతల సంచారం భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ఓ చిన్నారిపై చిరుత దాడి చేసిన విషయం తెలిసిందే.

Also Read: TDP : ప్రభుత్వానిది ధనబలం.. మాది ప్రజాబలం.. శ్రీకాళహస్తిలో ‘నిజం గెలవాలి’ సభలో నారా భువనేశ్వరి

We’re now on WhatsApp. Click to Join.

శేషాచలం అటవీ ప్రాంతంలో దాదాపు 45 చిరుతలు ఉన్నాయని అటవీశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. వీటిలో కొన్ని మాత్రమే ఆహారం కోసం వెతుక్కుంటూ మెట్ల మార్గంలోకి వస్తున్నాయని ఫారెస్ట్‌ అధికారులు తెలిపారు. లక్షిత అనే ఆరేళ్ల చిన్నారిపై దాడి చేసిన అనంతరం అలిపిరి మార్గంలో దాదాపు 200 కెమెరాలను ఏర్పాటు చేశారు అధికారులు. చిరుత, ఎలుగుబంటిని బంధించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పుడు మరోసారి చిరుతల జాడ కనిపించడంతో భక్తుల్లో భయాందోళన మొదలైంది. దీంతో తిరుమల కాలినడక దారి భక్తులను టీటీడీ అలర్ట్ చేసింది. చిరుతల సంచారంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తుండటంతో వాటిని కట్టడి చేయడంపై టీటీడీ దృష్టి సారించింది. చిరుతల సంచరాన్ని నిరోధించేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది.