National Teacher Awards: రాష్ట్రపతి చేతులమీదుగా జాతీయ ఉపాధ్యాయ అవార్డుల ప్రధానం

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముగ్గురు ఉపాధ్యాయులకు జాతీయ ఉపాధ్యాయ అవార్డు దక్కింది. సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం సందర్భం

Published By: HashtagU Telugu Desk
Teacher Awards

New Web Story Copy 2023 09 06t180523.020

National Teacher Awards: ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముగ్గురు ఉపాధ్యాయులకు జాతీయ ఉపాధ్యాయ అవార్డు దక్కింది. సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముగ్గురు ఉపాధ్యాయులను జాతీయ ఉపాధ్యాయ అవార్డు 2023తో సత్కరించారు.

విజ్ఞాన్ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన మొత్తం 75 మంది ఉపాధ్యాయులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2023 సంవత్సరానికి జాతీయ ఉపాధ్యాయ అవార్డును ప్రదానం చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో అవార్డు పొందిన ఉపాధ్యాయులందరికీ రూ.50 వేల నగదు, ప్రశంసా పత్రం అందజేశారు. 1962 నుండి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న జరుపుకుంటారు. నాటి భారత రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థుల అభ్యర్థన మేరకు ఆయన జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని సూచించారు.

Also Read: Errabelli Dayakar Rao: కేసీఆర్ కు మోసం చేస్తే క‌న్న‌త‌ల్లికి మోసం చేసిన‌ట్లే!

  Last Updated: 06 Sep 2023, 06:05 PM IST