Site icon HashtagU Telugu

Gadwal SP: గద్వాల జిల్లా ఎస్పీగా తోట శ్రీనివాసరావు బాధ్యతలు

Gadwal SP

Gadwal SP

Gadwal SP: జోగులాంబ గద్వాల్ జిల్లా నూతన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ)గా శ్రీ తోట శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. జిల్లా పోలీసు కార్యాలయానికి చేరుకున్న ఆయనకు జిల్లా డీఎస్పీలు సత్యనారాయణ, నరేందర్‌రావు పూలమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు. 2007 బ్యాచ్ గ్రూప్-1 అధికారి అయిన శ్రీనివాసరావు గతంలో పాడేరు, జనగామలో డీఎస్పీగా, కొత్తగూడెంలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్‌డీ)గా పనిచేశారు.

రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగంలో విధులు నిర్వహిస్తూ అదనపు ఎస్పీగా, గవర్నర్ వద్ద ఏడీసీగా కూడా పనిచేశారు. 2013లో ఐపీఎస్‌గా పదోన్నతి పొందిన తర్వాత సీఐడీలో సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా, బాలానగర్ లా అండ్ ఆర్డర్ డీసీపీగా పనిచేశారు. ఇటీవల బదిలీపై వచ్చిన ఆయన ఇప్పుడు జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. లాంఛనాల అనంతరం జిల్లాకు చెందిన ఇన్‌స్పెక్టర్‌ అధికారులు, ఎస్సైలు నూతన ఎస్పీకి పూలమాలలతో సత్కరించారు.

Also Read: Rajkot Fire: రాజ్‌కోట్ గేమింగ్ జోన్ ప్రమాదంపై సిట్ నివేదిక