Bahubali: ఇతడే నిజమైన బాహుబలి.. చేతులతో కారును పైకి ఎత్తి, పక్కకు జరిపాడు

ప్రపంచంలో రోజూ ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఎన్నో ఎవరూ ఊహించని విశేషాలు చోటుచేసుకుంటూ ఉంటాయి. వీటిని ఎక్కువమంది గమనించరు.

  • Written By:
  • Publish Date - April 12, 2023 / 09:59 PM IST

Bahubali: ప్రపంచంలో రోజూ ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఎన్నో ఎవరూ ఊహించని విశేషాలు చోటుచేసుకుంటూ ఉంటాయి. వీటిని ఎక్కువమంది గమనించరు. కానీ కొన్ని మాత్రం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. రోజూ సోషల్ మీడియాలో ఎన్నో ఆసక్తికర వీడియోలు ట్రెండింగ్ అవుతూ ఉంటాయి. తాజాగా అలాంటి ఓ ఇంట్రెస్టింగ్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ఓ వ్యక్తి రోడ్డుపై అడ్డదిడ్డంగా పార్కింగ్ చేసిన ఓ కారును తన చేతులతో పక్కకు జరిపాడు. భారీగా బరువు ఉండే కారును వట్టి చేతులతోనే పక్కకు జరపడం వింతగా మారింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియనప్పటికీ.. వీడియో మాత్రం వైరల్ గా మారింది. మల్టీ వీల్స్ అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో రోడ్డుపై మారుతీ సుజుకీ వ్యాగనార్ కారు ఎవరో పార్క్ చేశారు. అడ్డదిడ్డంగా పార్క్ చేశాడు. దీంతో ఓ వ్యక్తికి కోపం వచ్చిందో ఏమో రెండు చేతులతో ఆమాంతం కారును ఎత్తి పక్కకు జరిపాడు. 850 కిలోల ఉన్న కారును చేతులతో పక్కకు జరపడంతో ఇది చూసినవారు షాక్ అయ్యారు.

రోడ్డుపై కారు పార్కింగ్ చేసి ఉండగా అటువైపుగా ఎస్‌యూవీ కారులో వెళుతున్న వ్యJHSR అసౌకర్యానికి గురయ్యాడు. దీంతో కారును దిగి మారుతీ సుజుకీ వ్యాగనార్ దగ్గరకు వెళ్లాడు. రెండు చేతులతో ఎత్తి పక్కకు జరిపాడు. దీనికి కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో నెట్టింట్లో వైరల్‌గా మారింది. వావ్.. ఇదోక అద్భుతం అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. సినిమాల్లో చూసే ఇలాంటి యాక్షన్ సీన్లను నిజ జీవితంలోనూ చూస్తామని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. సినిమాల్లో హీరోలు కార్లను చేతులతో ఎత్తుతూ ఉంటారు. కానీ అవి గ్రాఫిక్స్ లో చేస్తారు. కానీ ఇతను రియల్ లైఫ్‌లో చేయడంతో ఇతడే నిజమైన హీరో అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.