BRS Minister: రాష్ట్రంలో యూరియా కొరత లేదు: మంత్రి నిరంజన్ రెడ్డి

రాష్ట్రంలో యూరియా కొరత లేదు అని, కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవు మంత్రి నిరంజన్ రెడ్డి హెచ్చరించారు.

  • Written By:
  • Publish Date - September 9, 2023 / 04:37 PM IST

BRS Minister: హైదరాబాద్ సచివాలయంలో శనివారం ఉదయం ఎరువుల సరఫరా మరియు నిల్వలపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత లేదు అని, కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవు మంత్రి నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. ఈ సీజన్ లో ఇప్పటి వరకు అందుబాటులో ఉంచిన యూరియా 9.93 లక్షల మెట్రిక్ టన్నులు ఉంచామని, ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న నిల్వలు 2.50 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నాయని ఆయన అన్నారు.

రాష్ట్రంలో 908 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, 16,615 అధీకృత డీలర్ల ద్వారా యూరియా సరఫరా జరుగుతుందని, మొత్తం రాష్ట్రంలో కేవలం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నాలుగు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో కృత్రిమ యూరియా కొరతను సృష్టించి యూరియా అందుబాటులో లేదని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు మంత్రి మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాష్ట్రంలో యూరియా లేదంటూ దుష్ప్రచారానికి తెరలేపారని ఆయన మండిపడ్డారు.

Also Read: Mahesh babu: 150 కోట్ల బడ్జెట్ దాటేసిన గుంటూరు కారం, మహేశ్ కెరీర్ లో ఇదే హ‌య్యెస్ట్