Site icon HashtagU Telugu

Gold: భారీగా పడిపోయిన బంగారం ధర..!!

Gold

Gold

పసిడి ధర పడిపోయింది. బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది ఊరటనిచ్చే వార్త. ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర దిగి వచ్చింది. పది గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ. 230 మేర తగ్గింది. దీంతో 24క్యారెట్ల బంగారం ధర రూ. 49,970గా ఉంది. 50వేల మార్క్ నుంచి కిందకు క్షీణించింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200మేర తగ్గింది. దీంతో రూ. 45,800కు వరకు క్షీణించింది. అయితే ఇది పది గ్రాములకు ఈ రేటు వర్తిస్తుంది.

ఇదికూడా చదవండి: PFIని ఐదేళ్లపాటు నిషేధించిన కేంద్రం…చట్టవిరుద్ధమైన సంస్థగా ప్రకటన..!!

కాగా వెండి ధరలు మాత్రం నిలకడగానే ఉన్నాయి. వెండిరేటులో ఎలాంటి మార్పు లేదు. నిన్నటి రేటే కొనసాగుతోంది. వెండి ధర కేజీకి 60,700గా ఉంది. నిన్న వెండి ధర రూ. 800మేర తగ్గింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా దిగివచ్చాయి. గోల్డ్ రేటు ఔన్స్ కు 0.15శాతం తగ్గింది. దీంతో గోల్డ్ రేటు ఔన్స్ కు 1633 డాలర్లకు పడిపోయింది. సిల్వర్ రేటు కూడా ఇదే దారిలో నడిచింది. 0.04 శాతం తగ్గుదలతో ఔన్స్ కు 18.32 డాలర్లకు పడిపోయింది.

Exit mobile version