Site icon HashtagU Telugu

Job Layoff: ఉద్యోగం పోయిందా.. పోతే పోనీ.. పీడా విరగడైంది!

Employees Layoff

Employees Layoff

ప్రముఖ కంపెనీలలో తొలగింపుల ప్రకటనలు కొంతమంది ఉద్యోగులలో (Job) భయాందోళనలు రేకెత్తిస్తుండగా.. మరికొందరు మాత్రం ‘తొలగింపు’ లను సంతోషంగా స్వాగతిస్తున్నారు. ఉన్నపళంగా ఉద్యోగం ఊడిపోతే సంతోషించడం ఏంటని సందేహిస్తున్నారా ? ఈ ఉద్యోగం పోతే తమకు నచ్చినట్లు జీవించవచ్చనేదే వారి సంతోషానికి కారణమట. పేరున్న కంపెనీ అనో, పెద్ద మొత్తంలో అందుకుంటున్న జీతం కారణంగానో ఇష్టంలేని పని చేస్తున్న వారు ఈ ఉద్యోగాల తొలగింపును తమకు అనుకూలంగా మాట్లాడుతున్నారు

గతంలో చేయాలనుకుని, రిస్క్ తీసుకోవడం ఎందుకని వెనుకడుగు వేసిన పనులను ఇప్పుడు తలకెత్తుకుంటున్నారు. చిన్నదో పెద్దదో మరో ఉద్యోగం (Job) దొరకకపోదనే ఆశాభావంతో ముందుకెళుతున్నారు. నెల నెలా అందే జీతంపైనే ఆధారపడి జీవిస్తున్న వారు మాత్రం కంపెనీల తొలగింపు ప్రకటనతో ఆందోళనకు లోనవుతున్నారు. సోషల్ మీడియా, కన్సల్టెన్సీ సర్వీసుల ద్వారా ఉద్యోగ వేట మొదలుపెడుతున్నారు.

యాజమాన్యం ఉద్యోగులను తొలగించనుందని రూమర్లు మొదలవగానే మేల్కొని తమకు సరిపడే ఉద్యోగం కోసం వేట మొదలుపెట్టిన వారు తొందరగానే సర్దుకుంటున్నారు. ఈ ఉద్యోగం పోగానే మరో ఉద్యోగంలో చేరిపోతున్నారు. నెల తిరిగేసరికి అందే జీతం కాస్త అటూఇటూగా ఉన్నా కొత్త బాధ్యతల్లో ఇమిడిపోతున్నారు.

లే ఆఫ్స్ లో భాగంగా ఉద్యోగం కోల్పోయిన పలువురు అమెరికన్లు పీడా వదిలిందని భావిస్తున్నట్లు చెప్పారు. గతంలో తాము నిర్వహించిన ఉద్యోగ బాధ్యతలు నచ్చకపోయినా జీతం కోసం పనిచేసినట్లు వెల్లడించారు. తమను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు లేఖ అందుకోగానే రిలీఫ్ గా ఫీలయినట్లు చెప్పారు. ప్రస్తుతం తమ హాబీలకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్లు వివరించారు.

Also Read:  Ghantasala last wish: ఘంటసాల చివరి కోరికను నెరవేర్చబోయి..!